EKADASI KALYANAMS AT UPAMAKA SV TEMPLE FROM MARCH 04-12 _ మార్చి 4 నుంచి 12వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరాలయంలో ఏకాదశి కల్యాణాలు
Tirupati, 01 March 20 ; The unique festival of Ekadashi Kalyanams will be conducted at Sri Venkateswara temple at Upamaka in Visakhapatnam from March 04-12.
Following are details of vahanams and rituals ;
04-03-20 (Wednesday) Pelli kavadi utsavam and Aswa Vahanam and Ankurarpanam
05-03-20 (Thursday) Pallaki utsavam, Dwajarohanam and Hamsa vahanam
06-03-20 (Friday) Rathotsavam, Garuda vahanam, Kalyanotsavam
07-03-20 (Saturday) Punyakoti vahanam
08-03-20 (Sunday) Thota utsavam, Raja Rajadhi vahanam, Gaja vahanam
09-03-20 (Monday) Chakrasnanam
10-03-20 (Tuesday) Dhwajavarohanam
11 and 12 (Wednesday and Thursday) Pavalimpu seva
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మార్చి 4 నుంచి 12వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరాలయంలో ఏకాదశి కల్యాణాలు
తిరుపతి, 2020 మార్చి 01 ; టిటిడికి అనుబంధంగా ఉన్న విశాఖ జిల్లా ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరాలయంలో మార్చి 4 నుంచి 12వ తేదీ వరకు ఏకాదశి కల్యాణాలు వైభవంగా జరగనున్నాయి.
మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 2.05 గంటలకు పెళ్లికావాడి ఉత్సవం, సాయంత్రం 5.45 నుండి 7.00 గంటల వరకు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, రుత్విక్ వరుణం, మృత్సుంగ్రహణము నిర్వహించనున్నారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 9.00 నుండి 10.00 గంటల వరకు అంకురార్పణ నిర్వహించనున్నారు.
మార్చి 5వ తేదీ ఉదయం 9.15 నుండి 9.50 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారికి, శ్రీ సుదర్శన పెరుమాళ్‌కు పల్లకి ఉత్సవం ఘనంగా జరగనుంది. ఉదయం 9.50 నుండి 10.50 గంటల వరకు ద్వజారోహణంతో కల్యాణోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6.45 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు హంసవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
మార్చి 6వ తేదీ సాయంత్రం 6.45 నుండి రాత్రి 8.30 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై, అమ్మవార్లు శేషతల్ప వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇస్తారు. రాత్రి 8.30 నుండి 10.00 గంటల వరకు రథోత్సవము, రాత్రి 10.00 నుండి 11.40 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవము వైభవంగా నిర్వహించనున్నారు. మార్చి 7వ తేదీ రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారు పుణ్యకోటి వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
మార్చి 8వ తేదీ మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు తోట ఉత్సవం, శ్రీ భూ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారు రాజాధిరాజవాహనంపై దర్శనమిస్తారు. అనంతరం రాత్రి 7.30 నుండి 9.00 గంటల వరకు శ్రీవారు గజవాహనంపై భక్తులను కటాక్షిస్తారు.
మార్చి 10వ తేదీ సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.000 గంటల వరకు ధ్వజావరోహణం, మార్చి 11, 12వ తేదీలలో రాత్రి 7.30 నుండి 8.00 గంటల వరకు పవలింపుసేవ నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.