NO COMPROMISE ON EKADASI ARRANGEMENTS – TTD EO _ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టిటిడి ఈవో సమీక్ష

Tirumala, 25 December 2017: There should be no compromise on the vaikuntha ekadasi darshan arrangements, said TTD EO Sri Anil Kumar Singhal.

A review meeting on Vaikuntha Ekadasi was held in Annamaiah Bhavan at Tirumala on Monday. The EO along with Tirumala JEO Sri KS Sreenivasa Raju reviewed department-wise arrangements for the big day. he instructed the Health and engineering wing officials to set up mobile toilets in Narayanagiri Gardens and queue lines.

He also instructed the Annaprasadam wing to make necessary food arrangements. “The queue lines are laid from Kalyanavedika Gogarbham junction to VQC junction. Deploy srivari sevakulu and Scouts to maintain pilgrim crowd wherever their services are necessary. Supply annaprasadam, beverages in outside lines also near these junctions during the festive days”, he instructed the concerned.

The EO instructed CVSO Sri Ravikrishna to make security arrangements in co-ordination with urban SP Tirupati Sri Abhishek Mahanty. “Also delpoy snake snatchers in queue lines”, he added.

The electrical and floral departments should display colourful themes for the big occasions, EO instructed electrical and garden wings.All HoDs were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టిటిడి ఈవో సమీక్ష

డిసెంబరు 25, తిరుమల 2017 ; తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే విశేష పర్వదినాల్లో ఒకటైన వైకుంఠ ఏకాదశికి పెద్దసంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం సాయంత్రం తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌. శ్రీనివాసరాజుతో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈసారి కొత్తగా కల్యాణవేదిక ద్వారా బాటగంగమ్మ, తిరువేంకటపదం ప్రాంతాలలో ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా వచ్చే భక్తులకు భద్రత, అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ, టీ, కాఫీ విరివిగా అందించాలని సూచించారు. అదేవిధంగా అటు క్యూలైన్లు ద్వారా వచ్చే భక్తులకు, ఇటు తిరువేంకటపదం, నారాయణగిరి క్యూలైన్ల ద్వారా వచ్చే భక్తులకు మరుగుదొడ్లు, సంచార మరుగుదొడ్లు విరివిగా ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖాధికారి డా. శర్మిష్ఠను ఆదేశించారు. అలాగే రాత్రి సమయాలలో పాముల బెడద లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేయాలని, పాములను పట్టే వారిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తిరుమలలో జీఎన్‌సి టోల్‌ గేట్‌ నుంచి శ్రీవారి ఆలయం వరకు, అదేవిధంగా మహాద్వారం నుంచి గర్భాలయం వరకు మరింత ఆకర్షిణీయంగా పుష్పాలంకరణలు చేపట్టాలని ఉద్యానవన శాఖ అధికారి శ్రీ శ్రీనివాస్‌ను ఆదేశించారు. తిరుమలతోపాటు అదనపు క్యూలైన్ల వెంబడి విరివిగా విద్యుత్‌ బల్పులు ఏర్పాటు చేయాలని ఎలక్ట్రికల్‌ అధికారులను కోరారు.

తిరుమలకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, స్విమ్స్‌, రుయా, బర్డ్‌ ఆసుపత్రుల నుంచి అదనపు వైద్య సిబ్బందిని సమీకరించుకోవాలని, మెడికల్‌ మొబైల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు తిరుమలకు విరివిగా చేరుకునేందుకు వీలుగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. భద్రతాపరంగా అవసరమైన పోలీస్‌ బందోబస్తును నియమించుకోవాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, తిరుపతి అర్బన్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతిలకు సూచించారు. భక్తులకు వసతి సౌకర్యాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గదులను కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నారాయణగిరి ఉద్యానవనాలు, ఇతర ప్రాంతాలలో భక్తులకు మరింత భక్తిభావాన్ని పెంపొందించేలా ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి ఉచిత పుస్తక ప్రసాదంను విరివిగా అందజేయాలన్నారు. భక్తులకు ఎప్పటికప్పుడు రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ శాఖ ద్వారా సమాచారాన్ని విస్తృతంగా తెలియజేయాలన్నారు. శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ను ఏర్పాటు చేసుకుని భక్తులకు సేవలందించాలని పీఆర్వో, డిఈవోలను ఆదేశించారు.

ఈ పర్వదినాల కారణంగా సుపధం మార్గం ద్వారా శ్రీవారి ఆలయంకు వెళ్లే ప్రత్యేక దర్శనాలను, ఫోటో మెట్రిక్‌ రీఎంట్రీ మార్గం, దివ్యదర్శనం, దివ్యాంగులు, వయోవృద్ధులు, చంటిపిల్లల దర్శనాలను రద్దు చేశామన్నారు. అలాగే గోవిందమాల భక్తులకు ఎలాంటి దర్శన ఏర్పాట్లు ఉండవని, గతంలోలాగానే ఇతర భక్తులతో కలసి శ్రీవారిని దర్శించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, తిరుపతి అర్బన్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ కోదండరామరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.