ELABORATE ARRANGEMENTS FOR SRIVARI TWIN BRAHMOTSAVAMS-TTD EO _ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు- టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

PRIORITY TO COMMON DEVOTEES

NO RECOMMENDATION LETTERS ACCEPTED

ALL PRIVILEGED DARSHANS CANCELLED

CM TO PRESENT PATTU VASTRAMS ON SEPTEMBER 18

NO PLYING OF TWO WHEELERS TO TIRUMALA ON GARUDA SEVA DAY

RESTRICTIONS TO CONTINUE ON FOOTPATHS DURING BRAHMOTSAVAMS

Tirumala, 31 August 2023: Elaborate and extensive arrangements are underway for the benefit of sea of devotees who are being anticipated to take part in the ensuing twin Brahmotsavams schedule in the months of September and October this year, said TTD EO Sri AV Dharma Reddy.

Earlier the TTD EO reviewed the preparations and arrangements for nine-day celebrations of the annual Brahmotsavams at Annamaiah Bhavan in Tirumala with the District Collector, SP, Tirupati Municipal Commissioner,and heads of all TTD departments.

Speaking to the media later the EO said the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy will present Pattu Vastrams on behalf of the State Government on September 18 and will also inaugurate the Srinivasa Sethu, Hostel building of SV Arts College in Tirupati and other rest houses at Tirumala on the same day.

He said on both mornings and evenings TTD will conduct Vahana Sevas and the prestigious Garuda Seva will commence from 7 pm onwards giving Darshan to a maximum number of devotees.

He said the common devotees will get priority during Vahana Sevas and Mula Murti Darshan. All privileged Darshans like senior citizens, physically challenged, parents with infants etc. were cancelled and no recommendation letters will be entertained for VIP Break Darshan during this period.

As as a special drive, daily 1000 devotees from SC/ST/BC and fishermen colonies where TTD built SV Temple under SRIVANI  Trust funds will be given Brahmotsavam Darshan along with free transport, Annaprasadam and accommodation facilities.

He said Plying of two-wheelers remains banned on Ghat roads on September 22 in view of Garuda Seva and all devotees will be provided with transport, Medicare, Security in coordination with district administration.

Among others, he said German sheds will be set up, artists from nine states will present unique cultural programs in front of Vahana Sevas on Mada streets,  experts from Kerala to supervise the parade of elephants, horses, bulls etc. with special decorations.

The current restrictions will continue for footpath walkers till fresh guidelines from forest department.

District collector Sri Venkataramana Reddy said four special officers are being appointed for coordination with TTD and also deputation of doctors, medicines from Ruia hospital etc. will be organised.

SP Sri Parameswara Reddy said special security arrangements during CM visit, Garuda Seva, Chakra Snanam, foolproof vigilance on Mada streets, inner ring road, outer ring road, Alipiri checkpoint, traffic regulations and checkpoints outside Tirupati for vehicle scrutiny will be arranged.

Tirupati Municipal Corporation Commissioner Smt Haritha said adequate sanitary workers will be deployed at the Railway Station, bus station and other crowded locations to keep the Temple City clean and garbage-free during Brahmotsavams. 

Tirumala temple one of the chief archakas Sri Venugopal Deekshitulu, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, DLO Sri Veeraju, Additional SP Sri Muniramaiah, RTC in charge RM Sri Jitender Reddy and other officials from the district administration and TTD were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

– సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట‌

– సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

– సెప్టెంబరు 18న ముఖ్య‌మంత్రివ‌ర్యులు ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌

– గ‌రుడ సేవ నాడు ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌లు ర‌ద్దు

– న‌డ‌క మార్గాల్లో నిబంధ‌న‌లు కొన‌సాగుతాయి

– జిల్లా యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం

– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2023, ఆగ‌స్టు 31: అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జ‌రిగే రెండు బ్రహ్మోత్సవాలకు విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉంద‌ని, భ‌క్తుల సౌక‌ర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీ, తిరుప‌తి కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో ఈవో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జ‌రుగుతాయ‌న్నారు. సెప్టెంబ‌రు 18న రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రివ‌ర్యుల చేతుల‌మీదుగా శ్రీ‌నివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల హాస్ట‌ల్ భ‌వ‌నం, తిరుమ‌ల‌లో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలియ‌జేశారు. ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌రకు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయ‌న్నారు. గ‌రుడ‌సేవను రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభించి భ‌క్తులంద‌రికీ ద‌ర్శ‌నం క‌ల్పిస్తూ నిదానంగా ముందుకు తీసుకెళ‌తామ‌ని తెలిపారు. సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని, వారికి సంతృప్తిక‌రంగా వాహ‌న‌సేవ‌ల ద‌ర్శ‌నంతోపాటు మూల‌మూర్తి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని చెప్పారు. బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని, స్వ‌యంగా వ‌చ్చే ప్రొటోకాల్ ప్ర‌ముఖులను మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని వివ‌రించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులు త‌దిత‌ర ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలను ర‌ద్దు చేసిన‌ట్టు వెల్ల‌డించారు. శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో ఆల‌యాలు నిర్మించిన‌ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార ప్రాంతాల్లోని భ‌క్తుల‌కు రోజుకు వెయ్యి మంది చొప్పున బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం చేయిస్తామ‌ని తెలిపారు. వీరికి ఉచితంగా ర‌వాణా, భోజ‌నం, బ‌స క‌ల్పిస్తామ‌న్నారు.

భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా సెప్టెంబ‌రు 22న గ‌రుడ‌సేవ నాడు ఘాట్ రోడ్ల‌లో ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌ను ర‌ద్దు చేశామ‌న్నారు. జిల్లా యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌క్తుల‌కు ర‌వాణా, వైద్యం త‌దిత‌ర సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని తెలియ‌జేశారు. బ్ర‌హ్మోత్స‌వాల కోసం విభాగాల వారీగా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేప‌డ‌తామ‌ని చెప్పారు. భ‌క్తుల కోసం ప‌లు ప్రాంతాల్లో జ‌ర్మ‌న్ షెడ్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. తొమ్మిది రోజుల పాటు జ‌రిగే ఉత్స‌వాల్లో తొమ్మిది రాష్ట్రాల నుండి క‌ళాకారుల‌ను ఆహ్వానించి వాహ‌న‌సేవ‌ల ఎదుట క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేస్తామ‌ని వివ‌రించారు. వాహ‌న‌సేవ‌ల ఎదుట ఏనుగులు, అశ్వాలు, వృష‌భాలు ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో పాల్గొంటాయ‌ని, వీటి నిర్వ‌హ‌ణ కోసం కేర‌ళ నుండి నిపుణులను ర‌ప్పిస్తున్నామ‌ని చెప్పారు. అట‌వీ శాఖ తిరిగి ఆదేశాలు జారీ చేసే వ‌ర‌కు న‌డ‌క మార్గాల్లో ఇప్పుడున్న నిబంధ‌న‌లు కొన‌సాగుతాయ‌ని తెలిపారు.

జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ గ‌తేడాది త‌ర‌హాలోని జిల్లాలోని అన్ని విభాగాల‌ను భాగ‌స్వాముల‌ను చేసి శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేస్తామ‌న్నారు. టీటీడీతో స‌మ‌న్వ‌యం కోసం న‌లుగురు అధికారుల‌ను ఇప్ప‌టికే ఏర్పాటు చేశామ‌ని, ఎక్సైజ్ చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. ట్యాక్సీల‌కు ధ‌ర‌లు నిర్ణ‌యించి స్టిక్క‌ర్లు అంటిస్తామ‌ని, రుయా ఆసుప‌త్రి, ఇత‌ర ప్రాంతాల నుండి వైద్యుల‌ను, మందుల‌ను అందుబాటులో ఉంచుతామ‌ని వివ‌రించారు.

ఎస్పీ శ్రీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ బ్ర‌హ్మోత్స‌వాలకు త‌గినంత మంది సిబ్బందితో పూర్తి భద్ర‌త క‌ల్పిస్తామ‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రివ‌ర్యుల ప‌ర్య‌ట‌న‌, గ‌రుడ సేవ‌, చ‌క్ర‌స్నానం రోజుల్లో ప్ర‌త్యేక భద్ర‌తా ఏర్పాట్లు చేప‌డ‌తామ‌న్నారు. శ్రీ‌వారి ఆల‌యం, మాడ వీధులు, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, ఔట‌ర్ రింగ్ రోడ్డు, అలిపిరి చెక్ పాయింట్ త‌దిత‌ర ప్రాంతాల్లో క‌ట్టుదిట్ట‌మైన భద్ర‌తా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. భ‌క్తుల ర‌ద్దీతోపాటు ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణకు ఏర్పాట్లు చేస్తామ‌ని తెలిపారు. తిరుప‌తి న‌గ‌రం శివార్ల‌లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహ‌నాల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తామ‌న్నారు.

తిరుప‌తి కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ శ్రీ‌మ‌తి హ‌రిత మాట్లాడుతూ తిరుప‌తిలోని రైల్వే స్టేష‌న్‌, బ‌స్టాండు, భ‌క్తులు సంచ‌రించే అన్ని ప్రాంతాల్లో అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేసి మెరుగ్గా పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని తెలిపారు.

మీడియా స‌మావేశంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, డిఎల్వో శ్రీ వీర్రాజు, అదనపు ఎస్పీ శ్రీ మునిరామయ్య, ఆర్టీసీ ఇన్ఛార్జి ఆర్ఎం శ్రీ జితేందర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడింది.