ELABORATE ARRANGEMENTS FOR SVV – JEO BHASKAR_ శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు ఆకట్టుకునేలా ఫొటో ఎగ్జిబిషన్‌, విద్యుద్దీపాలంకరణలు

Vijayawada, 28 June 2017: The temple management of Tirumala Tirupati Devasthanams (TTD) is making elaborate arrangements for the week-long big religious event Sri Venkateswara Vaibhavotsavams from July 2 to July 9 in PWD Grounds of Vijayawada, said Tirupati JEO Sri Pola Bhaskar.

Speaking to media persons after inspecting the ongoing arrangements in the grounds here on Wednesday he said the chief aim behind the programme is to facilitate the devotees to witness the sevas that are being performed in Tirumala at the door steps of devotees in their home towns. “This programme gained popularity within short span and so far we have organised this fete in Vizag, Guntur, Mumbai and Hyderabad”, he added.

PHOTO-GARDEN EXPO AND ELECTRICAL ILLUMINATION TO STAND AS HIGHLIGHTS

He said the photo exhibition depicting the interesting aspects related to Tirumala, VVIP visits, jewels of lord, religious events etc. will remain as a highlight during the fete apart from the gorgeous electrical illuminations with mythological themes and erection of floral diaromas.

LOCAL SRIVARI SEVA VOLUNTEERS ARE WELCOME

To extend services to the devotees who participate in this religious event, the local Srivari Seva volunteers can take part. Their services will be utilised in the distribution of food, queue line maintenance, exhibition etc. Every day the temple will be open from 6:30am with Suprabhatam till Ekantha Seva by 9pm. Meanwhile there will Astadalam on July 4, Sahasra Kalasabhishekam on July 5, Tiruppavada on July 6, Abhishekam on July 7, Vasanthotsavam and Srinivasa Kalyanam on July 8 and concludes with Pushpayagam on July 9.

PARKING AND QUEUE LINE SYSTEM

As tens of thousands of devotees are expected to take part in the fete, elaborate arrangements of parking, queue line management etc. are in offing.

DEVOTIONAL PROGRAMS WITH VERSATILE MUSICIANS TO ENTHRALL DENIZENS OF VIJAYAWADA

As the week long religious event of Sri Venkateswara Vaibhavotsavams are scheduled from July 2 to July 9, eminent scholars and versatile musicians are set to enthrall the denizens of Vijayawada.

As a part of the mega event, there will be religious discourse by Sri Kompella Ramasuryanarayana followed by devotional musical concert by Gazal Srinivas, on July 3 HH Sri Siddheswarananda Bharati Swamy will render his divine address followed by devotional extravaganza by Sri Gangadhara Shastry.

While every day from July 4 to 9, during Unjal Seva between 4pm and 6:30pm there will be devotional music program followed by Dharmika Upanyasam between 7pm and 8:15pm. On July 4 Sri PR Kousalya and Sri Krishna team will render spiritual songs while the religious discourse will be by Sri Mylavarapu Srinivasa Rao, while on July 5 the sankeertans by Sri Pavan Kumar of Hyderabad and discourse by Sri Mallapragada Srimannarayana, On July Musical Concert by Malladi Brothers and discourse by Sri Kasireddi Venkat Reddy, on July 7 Sri G Balakrishnaprasad and Smt Bullemma duo will render the Annamaiah Keertans and the discourse by Sri Dhulipalla Prabhakara Krishnamurthy while on July 8 Sri Vasu Rao and his team will render sankeertans and on final day by Smt Bullemma.

Additional CVSO Sri Siva Kumar Reddy, SE Sri Sudhakar Rao, SVV Project Special Officer Sri Prabhakar Rao, Garden Deputy Director Sri Srinivasulu, DE Sri Chandra Sekhar, Catering Officer Sri Desaiah, HDPP Secretary Sri Ramakrishna Reddy, PRO Dr T Ravi, EE Sri Nageswara Rao were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు ఆకట్టుకునేలా ఫొటో ఎగ్జిబిషన్‌, విద్యుద్దీపాలంకరణలు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

విజయవాడ, 2017, జూన్‌ 28: టిటిడి ఆధ్వర్యంలో జులై 2 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ వెల్లడించారు. విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో జరుగుతున్న శ్రీవారి నమూనా ఆలయం, ఇతర ఏర్పాట్లను బుధవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇక్కడి భక్తులు దర్శించేందుకు వీలుగా శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీవారి సేవల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇప్పటివరకు విశాఖపట్నం, గుంటూరు, ముంబయి, హైదరాబాద్‌ ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో నాడు-నేడు అనే అంశంతో ఆకట్టుకునేలా ఫొటో ఎగ్జిబిషన్‌, సర్వాంగసుందరంగా పుష్పాలంకరణ, ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా విద్యుద్దీపాలంకరణ, దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. భక్తులకు సేవలందించేందుకు స్థానికంగా ఉన్న శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామన్నారు.

ఈ ఉత్సవాల కోసం శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6.30 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించి రాత్రి 9.00 గంటలకు ఏకాంత సేవ వరకు కైంకర్యాలు నిర్వహిస్తామని జెఈవో తెలిపారు. ప్రత్యేక సేవల్లో భాగంగా జులై 4న అష్టదళ పాదపద్మారాధన, జులై 5న సహస్రకలశాభిషేకం, జులై 6న తిరుప్పావడ, జులై 7న అభిషేకం, జులై 8న వసంతోత్సవం, శ్రీనివాస కల్యాణం, జులై 9న పుష్పయాగం నిర్వహిస్తామని వెల్లడించారు. జులై 7వ తేదీ మినహా ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం అందిస్తామని తెలియజేశారు. అంతకుముందు శ్రీవారి నమూనా ఆలయం, క్యూలైన్లు, పార్కింగ్‌ తదితర ఇంజినీరింగ్‌ పనులను పరిశీలించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు.

శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో ఆకట్టుకునేలా ధార్మిక, సంగీత కార్యక్రమాలు జూలై 2న శ్రీ గజల్‌ శ్రీనివాస్‌ భక్తి సంగీతం

శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జులై 2 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో ధార్మికోపన్యాసాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జూలై 2వ తేదీన సాయంత్రం ప్రముఖ పండితులు తిరుపతికి చెందిన శ్రీ కొంపెల్ల రామసూర్యనారాయణ ధార్మికోపన్యాసం, ప్రముఖ గాయకులు శ్రీ గజల్‌ శ్రీనివాస్‌ భక్తి సంగీతం, జూలై 3వ తేదీన సాయంత్రం గుంటూరుకు చెందిన శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామివారి ధార్మికోపన్యాసం, శ్రీ గంగాధర్‌శాస్త్రి భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జూలై 4 నుంచి 9వ తేదీ వరకు సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవలో భక్తి సంగీతం, రాత్రి 7 నుంచి 8.15 గంటల వరకు ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు. జూలై 4న హైదరాబాద్‌కు చెందిన శ్రీ పి.ఆర్‌.కౌసల్య, శ్రీకృష్ణ బృందం, జూలై 5న హైదరాబాద్‌కు చెందిన శ్రీ పవన్‌కుమార్‌ బృందం, జూలై 6న విజయవాడకు చెందిన శ్రీ మల్లాది బ్రదర్స్‌, జూలై 7న తిరుపతికి చెందిన శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌, శ్రీమతి బుల్లెమ్మ బృందం, జూలై 8న శ్రీ వాసు రావు బృందం, జూలై 9న శ్రీమతి ఆర్‌.బుల్లెమ్మ బృందం భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

జూలై 4న హైదరాబాద్‌కు చెందిన శ్రీ మైలవరపు శ్రీనివాసరావు, జూలై 5న విజయవాడకు చెందిన శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ, జూలై 6న హైదరాబాద్‌కు చెందిన శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి, జూలై 7న నిడదవోలుకు చెందిన శ్రీ ధూళిపాళ ప్రభాకరకృష్ణమూర్తి ధార్మికోపన్యాసాలు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ శ్రీ సుధాకర్‌రావు, ఇఇ శ్రీ నాగేశ్వరరావు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు, గార్డెన్‌ డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, డిఇ శ్రీ చంద్రశేఖర్‌, క్యాటరింగ్‌ అధికారి శ్రీ దేశయ్య తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.