ELECTRIC BUSES HELP REDUCE POLLUTION IN TIRUMALA-TRANSPORT GM _ తిరుమ‌ల‌లో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌తో భారీగా కాలుష్య నియంత్ర‌ణ‌

20 MORE ELECTRIC BUSES TO BE ADDED

Tirumala, 13 October 2026: The deployment of free electric buses under the Srivari Dharma Ratham service has helped reduce air pollution in Tirumala, said General Manager (Transport), TTD, Sri Ramu.

Addressing media at the Rambageecha Media Centre, in Tirumala on Tuesday evening, he said TTD was currently operating 38 electric buses on two routes, ensuring a bus every three minutes for pilgrims.

He said the daily number of trips had risen from 30, catering to about 35,000 devotees earlier, to 650 trips, benefiting nearly 85,000 pilgrims. 

To further strengthen the service, 20 additional electric buses would be added to the fleet shortly, he maintained.

He also said TTD is contemplating to install digital display boards at all bus stops in Tirumala to provide pilgrims with real-time information on bus arrival and departure timings besides setting up smart bus stations.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

తిరుమ‌ల‌లో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌తో భారీగా కాలుష్య నియంత్ర‌ణ‌

టీటీడీ ర‌వాణా విభాగం జీఎం శ్రీ రాము

తిరుమ‌ల‌, 2026 అక్టోబ‌ర్ 13: తిరుమ‌ల‌లో భ‌క్తుల సౌక‌ర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చిన ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌తో (శ్రీ‌వారి ధ‌ర్మ ర‌థాలు) పెద్ద ఎత్తున కాలుష్యాన్ని అరిక‌డుతున్న‌ట్లు టీటీడీ ర‌వాణా విభాగం జీఎం శ్రీ రాము తెలిపారు. తిరుమ‌ల‌లోని రామ్ భ‌గీచా-2 లోని మీడియా సెంట‌ర్ లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. 

ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో 38 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు రెండు రూట్ల‌లో భ‌క్తుల‌కు సేవ‌లు అందిస్తున్నాయ‌ని చెప్పారు. ప్ర‌తి 3 నిమిషాల‌కు ఒక బ‌స్సు అందుబాటులోకి తీసుకురావ‌డంతో భ‌క్తులు ఉచిత ర‌వాణా స‌దుపాయాన్ని విరివిగా వినియోగిస్తున్నార‌ని తెలిపారు. గ‌తంలో రోజుకు 300 ట్రిప్పుల ద్వారా 35 వేల మంది భ‌క్తులు ప్ర‌యాణించేవార‌నీ, ప్ర‌స్తుతం 850 ట్రిప్పుల‌కు పెంచ‌డంతో ఉచిత బ‌స్సుల్లో ప్ర‌యాణించే భ‌క్తుల‌ సంఖ్య దాదాపు 80వేల‌కు చేరింద‌ని తెలిపారు. రాబోయే రోజుల్లో మ‌రో 20 బ‌స్సుల‌ను అద‌నంగా పెంచేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని త‌ద్వారా మ‌రింతమంది భ‌క్తులు ఉచిత బ‌స్సుల్లో సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణించేలా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని చెప్పారు.

బ‌స్ స్టాపుల్లో డిజిట‌ల్ డిస్ల్పే బోర్డుల ద్వారా బ‌స్సుల స‌మాచారం ముంద‌స్తుగా అందిస్తుండ‌టంతో భ‌క్తుల‌కు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంద‌ని చెప్పారు. డీజిల్ బ‌స్సు స్థానంలో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు అందుబాటులోకి తీసుకురావ‌డంతో క‌ర్బ‌న ఉద్గారాలు విశేష స్థాయిలో త‌గ్గ‌డంతో పెద్ద ఎత్తున కాలుష్యాన్ని నియంత్రించ‌డం జ‌రుగుతోంద‌ని తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సీపీఆర్వో డాక్ట‌ర్ టి.ర‌వి, పీఆర్వో కుమారి నీలిమ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.