ENDOWMENTS MINISTER HAILS SRI PAT DEVELOPMENT_ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ‌శాఖ మంత్రివ‌ర్యులు గౌ..శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌

Tiruchanur, 19 Jun. 19: The Honourable Minister for AP Endowments Sri V Srinivasulu who is on his maiden visit to Tirumala and Tiruchanoor temples, hailed the development measures initiated by TTD for the sake of pilgrims.

Earlier on his arrival at Tiruchanoor, he was offered traditional welcome by temple priests and accorded a grand reception by JEO for Tirupati Sri B Lakshmikantham.

After darshan of Sri Padmavathi Devi he said, he sought the Universal Mother to shower Her benign blessings on Her children and keep the state with prosperity. He also complimented the Augmented Reality Technology (ART) introduced by TTD at Friday Gardens depicting the story of Padmavathi Devi.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ‌శాఖ మంత్రివ‌ర్యులు గౌ..శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌

తిరుప‌తి, 2019 జూన్ 19: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని బుధ‌వారం ఉదయం రాష్ట్ర దేవాదాయ‌శాఖ మంత్రివ‌ర్యులు గౌ.. శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌ దర్శించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా గౌ.. మంత్రివ‌ర్యులు  మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నూత‌న ప్ర‌భుత్వం ఏర్పాడింద‌ని, వ‌ర్షాలు కురిసి పాడిపంట‌లు, ప‌శుప‌క్ష్యాదుల‌తో రాష్ట్రం స‌స్య‌శ్యామ‌లంగా ఉండాల‌ని అమ్మ‌వారిని ప్రార్థించాన‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ సుఖసంతోషాల‌తో ఉండాల‌ని, అంద‌రిపైనా అమ్మ‌వారి ఆశీస్సులు ఉండాల‌ని కోరుకున్న‌ట్టు చెప్పారు.  తిరుచానూరుకు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి అభివృద్ధి చేయ‌డం జ‌రిగింద‌న్నారు.   
    
అదేవిధంగా ఫ్రైడే గార్డెన్స్‌లో ఆగ్‌మెంటేషన్‌ రియాలటీ టెక్నాలజీ ద్వారా  స్థలపురాణం, అమ్మవారి పుట్టుక, శ్రీపద్మావతి పరిణయం, శ్రీనివాసుడి కల్యాణం వరకు  వరుసక్రమంలో ఛాయచిత్రాలతో కూడిన కథనాన్ని తెలుసుకునేలా టిటిడి ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.  

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ.. మంత్రివ‌ర్యులుకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం, అర్చకులు మంగళవాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్‌తో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శేషవస్త్రం, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఎవిఎస్‌వో శ్రీ నందీశ్వ‌ర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.