ENDOWMENTS SECRETARY SWORN IN AS EX OFFICIO MEMBER OF TTD BOARD _ టిటిడి ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా శ్రీ ఎం.గిరిజాశంకర్ ప్రమాణస్వీకారం

Tirumala, 2 October 2020: The Endowments Secretary of AP Sri M Girija Shankar, sworn in as Ex-officio member of TTD board at the Srivari temple on Friday.

The TTD EO Sri Anil Kumar Singhal served the oath of office on Sri Girija Shankar. Later the Ex-officio member was also rendered Vedasirvachanam at Ranganayakula Mandapam followed by the presentation of Srivari theertha prasadams.

TTD Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar, Smt Sada Bhargavi JEO ( Education and Health), temple DyEO Sri Harindranath, DyEO Boardcell Smt Sudha Rani were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా శ్రీ ఎం.గిరిజాశంకర్ ప్రమాణస్వీకారం
 
తిరుమల, 2020 అక్టోబరు 02: రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ ఎం.గిరిజాశంకర్ శుక్రవారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టిటిడి ట్రస్ట్ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆయ‌న‌ చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు, వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అంద‌జేశారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఇఓ శ్రీ పి.బసంత్ కుమార్, జెఇఓ(విద్య, ఆరోగ్యం) శ్రీమతి ఎస్.భార్గవి, ఆల‌య డెప్యూటీ ఈవో  శ్రీ హరీంద్రనాథ్, డెప్యూటీ ఈవో జ‌న‌ర‌ల్ శ్రీ‌మ‌తి సుధారాణి పాల్గొన్నారు.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.