ENTHRALLING CULTURAL PROGRAMS AT SRI PAT BTU _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు
Tiruchanoor, 23 Nov. 19: On the day one of the on-going Kartheeka brahmotsavams of Sri Padmavati Ammavaru Temple at Tiruchanoor, the cultural programs organized by the TTD HDPP at the Asthana mandapam enthralled the devotees on Saturday.
The team of Sri S Muniratnam rendered Mangaladhwani and Sri Sri Sri RamachandraJeeyar swami spoke on Sri Lakshmi Tatvam, Sampat Kumaracharya presented a religious discourse followed by bhakti sangeet by Sri Vinaya prasad and team from Bengaluru.
Later on Smt Vijaya Kumari Bhagavtaarini of Tirupati presented Harikatha Parayanam and Smt.Seshamamba team from Hyderabad participated in the Unjal seva and presented Annamacharya Sankeertans in Annamaiah Vinnapalu.
Similarly, the Smt Dwaram Lakshmi team of Tirupati presented bhakti sangeet at the Mahati auditorium in Tirupati and the Bangalore team of Sri Pradeshacharya presented sankeertans at Annamacharya Kala Mandiram. Sri Srinivas Yadav team from Visakhapatnam rendered bhakti sangeet at Ramachandra Pushkarini while B E Harichandran team of Tirupati enthralled the devotees with bhajans at the Shilparamam near Tiruchanoor.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు
తిరుపతి, 2019 నవంబరు 23: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారి శోభను మరింత ఇనుమడింప చేశాయి. ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థానమండపంలో నిర్వహించిన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఎస్.మునిరత్నం బృందం మంగళధ్వని, ఉదయం 6.00 నుండి 7.30 గంటల వరకు శ్రీశ్రీశ్రీ రామచంద్ర జీయర్‌స్వామి శ్రీ లక్ష్మీతత్త్యం – వేదమూలకత్వంపై అనుగ్రహభాషణం చేశారు.
ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు తిరుపతికి చెందిన ఆచార్య సంపత్ కుమారాచార్య ధార్మికోపన్యాసం చేశారు. ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బెంగుళూరుకు చెందిన శ్రీ వినయప్రమోద్ బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.
అనంతరం మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి విజయకుమారి భాగవతారిణి హరికథ పారాయణం చేశారు. కాగా సాయంత్రం 4.30 నుండి 6.00 గంటల వరకు అన్నమయ్య విన్నపాలు, ఊంజల్ సేవలో సంకీర్తనలనుహైదరాబాదుకు చెందిన డా.గిరిజ శేషమాంబ బృందం గానం చేయనున్నారు.
అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ద్వారం లక్ష్మి బృందంచే భక్తిసంగీతం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు బెంగుళూరుకు చెందిన శ్రీ ప్రాదేశాచార్య బృందం భక్తి సంగీతం, రామచంద్ర పుష్కరిణి వద్ద విశాఖపట్నంకు చెందిన శ్రీ వై.శ్రీనివాస యాదవ్ బృందంచే భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించన్నున్నారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన బి.ఇ.హరిచందన బృందం భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.