EO AND JEO INSPECT FOOD, SNACKS SUPPLIES AT MADA STREETS_ శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో ఈవో విస్తృత తనిఖీలు

Tirumala 27,September 2017: The TTD Executive Officer Sri Anil Kumar Singhal and Tirumala JEO Sri KS Srinivasa Raju today made an on the spot inspection of the TTD services at Mada street galleries.

Randomly interacting with devotees sitting in the four Mada streets, the TTD officials inquired about the services-food, snacks,milk, tea, buttermilk water supplies to them. Where ever they were hiccups and directed the officials to take necessary remedial steps.

The officials told the devotees that after the commencement of the Garuda seva at 7.30PM Anna prasadams would be available at the Tarigonda Vengamamba Annaprasadam complex till late hours.

They advised the devotees to wit in the galleries where the TTD would supply everything -water,snacks and beverages- till 5-6 PM. TTD has commenced supplies in the galleries to devotees from afternoon itself as it is difficult for them to come out for refreshments. Elaborate arrangements have been made to ensure that none of the devotees went hungry in the galleries.

The EO and JEO also inspected the security arrangements and also entry and exit gates at the mada streets to ensure that devotees came and left safely after the blessed darshan of Lord Venkateswara.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో ఈవో విస్తృత తనిఖీలు

సెప్టెంబర్‌ 27, తిరుమల 2017: శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా బుధవారం గరుడ వాహనసేవను పురస్కరించుకుని శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో భక్తుల ఏర్పాట్లపై టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ విస్తృత తనిఖీలు నిర్వహించారు. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ పాల్గొన్నారు.

గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, పాలు ఏర్పాట్లను పరిశీలించారు. పలువురు భక్తులతో మాట్లాడి టిటిడి కల్పించిన సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. గ్యాలరీల్లోని భక్తులకు, మాడ వీధుల బయట గల భక్తులకు, దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని ఆ విభాగం అధికారులను ఆదేశించారు. గరుడసేవ పూర్తయిన తరువాత కూడా భక్తులందరికీ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాలను అందించాలన్నారు. గ్యాలరీల్లోని భక్తులకు బిస్బెల్లా బాత్‌, టమోటా రైస్‌, పెరుగన్నం, పులిహోర, ఉప్మా, కాఫి, పాలు అందిస్తున్నట్టు తెలిపారు. మాడ వీధుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని, గరుడసేవ అనంతరం చెత్తను తరలించాలని అధికారులకు సూచించారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌, భద్రతా సిబ్బందికి సూచించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.