EO CONDEMNS BJP CRITICISM ON OLD MANDAPAMS RENOVATION _ బిజెపి నేత శ్రీ భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ ఈవో

Tirumala,03 November 2023: TTD EO Sri AV Dharma Reddy has condemned the BJP leader Sri Bhanu Prakash Reddy comments on the TTD proposal to reconstruct the ancient Mandapams near Padala Mandapam at Alipiri and Paruveta Mandapam in Tirumala.

 

Interacting with the media persons after Dial your EO program at Annamaiah Bhavan on Friday in Tirumala, the TTD EO said that the BJP leader had criticised the renovated and redesigned Paruveta Mandapam and wanted retention of old structure only.

 

Terming the criticism as a painful act, the EO said if Sri Bhanuprakash Reddy is ready, he would show him both the photos of old Mandapam and the newly renovated Mandapam and also shall be scrutinized personally. 

 

He said the old Mandapam near Alipiri was dilapidated and beyond repair and hence on the report of the engineering department the Mandapam was renovated.

 

Both the Mandapams are not under the jurisdiction of the Archaeological Survey of India and hence no permissions needed from the ASI.

 

He said such motivated and distorted criticism on sensitive issues hurts the sentiments devotees and inflicts injustice on the Hindu community.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

బిజెపి నేత శ్రీ భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ ఈవో

తిరుమల, 2023 నవంబరు 03: పార్వేట మండపం, అలిపిరి పాదాల మండపం వద్ద గల విశ్రాంతి మండపాల పునర్నిర్మాణానికి సంబంధించి బిజెపి నేత శ్రీ భానుప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఖండించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు.

పార్వేట మండపం స్థానంలో కళాఖండాలను యథాతథంగా ఏర్పాటు చేసి నూతన మండపాన్ని పునర్నిర్మించామని, ఇది అత్యంత సుందరంగా ఉందని ఈవో చెప్పారు. అయితే సదరు బిజెపి నేత పాత మండపమే బాగుందని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. ఈ విషయానికి సంబంధించి శ్రీ భానుప్రకాష్ రెడ్డి నేరుగా వస్తే పాత మండపం ఫొటోలను, నూతన మండపాన్ని పరిశీలించి ఏది బాగుందో మీడియా సమక్షంలో స్పష్టం చేస్తామని తెలియజేశారు. అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఉన్న విశ్రాంతి మండపం మరమ్మతులకు ఆస్కారం లేని విధంగా శిథిలావస్థకు చేరుకుందని ఈవో చెప్పారు. ఇంజినీరింగ్ అధికారులు మండపాన్ని పరిశీలించి పునరుద్ధరించాలని ఇచ్చిన నివేదిక మేరకు జీర్ణోదరణ చేస్తున్నామన్నారు. ఈ రెండు మండపాలు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో లేవని, వీటి పునరుద్ధరణకు పురావస్తు శాఖ అనుమతులు అవసరం లేదని చెప్పారు.

సున్నితమైన ఇలాంటి విషయాలను వక్రీకరించి స్వార్థం కోసం అసత్య ప్రచారం చేస్తే వ్యవస్థ పైన భక్తులకు అపనమ్మకం ఏర్పడుతుందని, ఇది హిందూ సమాజానికి అన్యాయం చేసినట్టు అవుతుందని తెలియజేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.