EO INSPECTS PUSHKARINI _ తిరుమలలో ఇంజినీరింగ్ పనులను తనిఖీ చేసిన టిటిడి ఈవో
Tirumala, 1 Mar. 19: TTD EO Sri Anil Kumar Singhal on Friday inspected the ongoing development works at Pushkarini and Narayanagiri Gardens along with Tirumala JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri Gopinath Jatti.
Later speaking to media persons he said, to avoid long waiting in queue lines of Narayanagiri Gardens by pilgrims under inclement weather conditions, TTD is constructing a permanent structure at Rs.23crores.
The EO who also inspected Swamy Pushkarini said that the new brass grills will be set up at Rs.4.5crores. He also said a Radha Mandapam will be constructed at Rs.1.5crores as per the suggestion of Agama Advisory Committee.
The EO said, the entire process of Astabandhana Balalaya Mahasamprokahanam performed to Srivari temple in August last will also be publised as a book for future generations. He also said the Mahasamprokshanam for Varahaswamy temple will be observed from April 24 to 27.
Earlier he also visited the new buildings of Srivari Seva Sadan.
NO DIVERSION OF TTD FUNDS
TTD EO Sri Anil Kumar Singhal on Friday clarified that not even a single penny from TTD coffers has been diverted to government works.
Speaking to media, the EO said, some people via social media spread a wrong news that the TTD coffers are been diverted for other works which is totally baseless and false.
Whatever dharmic works we are entitled to do, we have just taken up those works as per prescribed norms and guidelines, he asserted.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
తిరుమలలో ఇంజినీరింగ్ పనులను తనిఖీ చేసిన టిటిడి ఈవో
తిరుమల, 01 మార్చి 2019: తిరుమలలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులను శుక్రవారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతన శ్రీవారి సేవ భవన సముదాయాలు, నారాయణగిరి ఉద్యానవనాలు, శ్రీవారి పుష్కరిణి వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు.
అనంతరం శ్రీవారి పుష్కరిణి వద్ద మీడియాతో మాట్లాడుతూ నారాయణగిరి ఉద్యానవనాల్లో టైంస్లాట్ సర్వదర్శనం భక్తులు వేచి ఉండేందుకు వీలుగా, ఎండకు, వానకు, చలికి ఇబ్బందులు పడకుండా రూ.23 కోట్లతో చేపడుతున్న శాశ్వత కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించామన్నారు. అక్కడ అన్నప్రసాదాలు, మరుగుదొడ్ల వసతి కల్పిస్తామన్నారు. శ్రీవారి పుష్కరిణి వద్ద ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు రూ.4.50 కోట్లతో పనులు ప్రారంభించినట్టు తెలిపారు. అదేవిధంగా మాడ వీధుల్లో భూగర్భ కేబుళ్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. సప్తద్వారాల అంశానికి సంబంధించి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లోని ఆర్చిలు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద గల సిమెంట్ కాంక్రీట్ ఆర్చిలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. తిరుమలలో పచ్చదనం పెంపు కోసం అటవీ, ఉద్యానవన విభాగాల ఆధ్వర్యంలో మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టిన మొక్కల పెంపకం పనులను త్వరలో పరిశీలిస్తామన్నారు.
ఇటీవల జరిగిన ఆగమ సలహా మండలి సమావేశంలో రథమండపం నిర్మించాలని తీర్మానం జరిగిందని, రూ.1.50 కోట్లతో ఈ పనులు చేపడతామని ఈవో తెలిపారు. శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 24 నుండి 27వ తేదీ వరకు మహాసంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలో 2018, ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు జరిగిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఘట్టాన్ని గ్రంథస్తం చేయనున్నట్టు తెలిపారు.
ఈ తనిఖీల్లో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, ఇఇ శ్రీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకే టిటిడి నిధుల వినియోగం : ఈవో
టిటిడి నిధులను నిబంధనల మేరకే వినియోగిస్తున్నామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. అయితే ఇందుకు విరుద్ధంగా ఇతర సంస్థలకు టిటిడి నిధులు తరలిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమం సందర్భంగా ఈవో మాట్లాడుతూ 2019-20 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను రూ.3,116.25 కోట్లతో ప్రవేశపెట్టామన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, ఖర్చులు పోను మిగిలిన నిధులను ధర్మప్రచార, సంక్షేమ తదితర కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని తెలిపారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.