ALL SET FOR RATHASAPTHAMI SAY TTD EO_ తిరుమలలో రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ ససంఘాల్‌

Tirumala, 23 January 2018: TTD Executive Officer, Anil Kumar Singhal today said that all arrangements were made for anticipated devotee crowds of over 1.5 lakhs on the Rathasapthami day tomorrow.

Speaking to reporters after an inspection of the mada streets along with Tirumala JEO Sri KS Sreenivasa Raju and other senior officials he said.

He said he reviewed the arrangements in which eight lakh water packets, 3 lakh buttermilk packets were kept ready and along with snacks and food packets for service of devotees waiting in queue lines.

He said nine big screens were set up on mada streets, and 120 more toilets in addition to 600 already in position and 700 sanitary workers have been deployed for service on Rathasaptami day.

The EO said the additional medical staff has been deployed for service on that day and in all 400 TTD officials will be positioned at all sectors to ensure quick darshan, and also provision of water, snacks and food packets on a war footing to devotees who have already commenced queuing up since afternoon for tomorrows darshan.

The He appealed all devotees to patiently beget Darshan and darshan of Lord Venkateswara on various vahana seas and also partake prasadam and other services specially geared for their benefit during the sacred festival of Rathasapthami.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ ససంఘాల్‌

జనవరి 23, తిరుమల 2018: భూలోక వైకుంఠమైన తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. జనవరి 24వ తేదీ బుధవారం రథసప్తమిని పురస్కరించుకుని భక్తుల కొరకు టిటిడి చేసిన ఏర్పాట్లను టిటిడి ఈవో, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి మంగళవారం సాయంత్రం ఆలయ నాలుగు మాడ వీధులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా తిరుమలకు విచ్చేసే భక్తులకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్యాలరీలలోని భక్తులకు ఉదయం అల్పాహారం, పాలు, అన్నప్రసాదాలు, 8లక్షల త్రాగునీరు ప్యాకెట్లు, 3లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. అందుబాటులో ఉన్న 480 మరుగుదొడ్లతో పాటు అదనంగా 120 తాత్కాలిక మరుదొడ్లును ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్యనిర్హణార్థం 700 మంది అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. అదే విధంగా భక్తుల సౌకర్యార్థం అంబులెన్స్‌, డాక్టర్లు, అదనపు పారామెడికల్‌ సిబ్బంది ఎప్పటకప్పుడు అందుబాటులో వుంటారన్నారు. భక్తులను ఆకట్టుకొనే విధంగా విద్యుత్తు దీపాలంకరణలతో కూడిన కటౌట్లు, విశేషంగా పుష్పాలంకరణలు చేసినట్లు తెలిపారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అగ్నిమాపకశాఖవారు తిరుమలలోని అగ్నిమాపక విభాగానికి అందించిన 4 లక్షల రూపాయల విలువైన మిస్ట్‌బుల్లెట్‌ పనితీరును పరిశీలించారు. దీనిని ప్రధమ అగ్ని ప్రమాద నివారణకు వినియోగిస్తారు. ఇందులో ఫోమ్‌, నీళ్ళు, రసాయనాల మిశ్రమంతో కూడిన సిలెండర్లు అమర్చబడి ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, సి.ఇ. చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌.ఇ2 శ్రీ రామచంద్రారెడ్డి, వి.జి.ఓ శ్రీ రవీంద్రారెడ్డి, టి.టి.డి ట్రాన్స్‌పోర్టు జి.యం. శ్రీ శేషారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. —————————————————-

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.