EO INSPECTS BALAJI NAGAR _ తిరుమల బాలాజి న‌గ‌ర్‌లో తనిఖీలు నిర్వహించిన ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

TIRUMALA, 10 AUGUST 2022: TTD EO Sri AV Dharma Reddy on Wednesday morning inspected the ongoing development works at Balaji Nagar area in Tirumala.

He also verified the electrical, drainage, cleaning and other facilities and interacted with the locals.

He instructed the Engineering officials concerned to remove the scrap materials lying Infront of several houses and shift them immediately to Tirupati and also directed to enhance greenery in the surroundings.

The Engineering and Health Officials informed EO that so far 480 tonnes of garbage and waste have been lifted and cleared.

SE2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, EE Sri Surendra Reddy, VGO Bali Reddy and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల బాలాజి న‌గ‌ర్‌లో తనిఖీలు నిర్వహించిన ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2022 ఆగ‌స్టు 10: తిరుమల బాలాజి న‌గ‌ర్‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు, పార్కింగ్ ప్రాంతాల‌ను ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి బుధ‌వారంనాడు అధికారులు, స్థానికుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

అందులో భాగంగా తిరుమ‌ల‌లోని బాలాజి నగర్‌లో డ్రైనేజి, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు త‌దిత‌ర వాటిని కూడా ప‌రిశీలించారు. అక్క‌డ ఉన్న కాంక్రీట్ వ్య‌ర్థాల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలాజి నగర్‌లో ప‌చ్చ‌ద‌నం పెంపొందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఇనుము త‌దిత‌ర వ్య‌ర్థాల‌ను తిరుప‌తికి త‌ర‌లించాల‌న్నారు. వాహ‌నాల పార్కింగ్ అభివృద్ధి ప‌నుల‌ను త్వ‌రితగ‌తిన పూర్తి చేయాల‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 480 ట‌న్నుల వ్య‌ర్థాల‌ను తొల‌గించిన‌ట్లు ఇంజినీరింగ్ అధికారులు ఈవోకు వివ‌రించారు.

అనంతరం అక్కడి స్థానికులకు టీటీడీ చేస్తున్న అభివృద్ధి పనులను, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ.2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఆరోగ్య విభాగం అధికారిణి డా. శ్రీ‌దేవి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇఇ శ్రీ సురేంద్ర‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.