EO INSPECTS CRO, SAPTHAGIRI _ సిఆర్ఓ మరియు సప్తగిరి వసతి సముదాయాల వద్ద టీటీడీ ఈవో తిణిఖీలు

TIRUMALA TIRUPATI DEVASTHANAMS

EO INSPECTS CRO, SAPTHAGIRI

OBSERVES ROOM ALLOTMENT SYSTEM

TIRUMALA, 17 AUGUST 2O24: TTD EO Sri J Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdary and CVSO Sri Sreedhar, inspected the Sapthagiri Satralu and Central Reception Office on Saturday at Tirumala.

Initially, at Sapthagiri Satralu he inspected the rooms, verified the cleanliness in corridors, bathrooms and also checked the switchboards, Jalaprasadam, matresses, beds, cots and bedsheets. Later he asked the officials concerned to list out the various damages and immediately rectify the defects. The EO also directed the officials to carryout deep cleaning and ensure that the premises be kept clean. Later the EO interacted with the pilgrims and verified the allotment process at the counters.

Later at the Central Reception Office, the EO observed the process of allotment of rooms to the devotees. He checked the Electronic Display Board, information kiosks and also interacted with the devotees from Karnataka and Kallakurichi. The EO instructed the officials concerned also to display the information on the availability of rooms at Tirumala for the convenience of the pilgrims. He also directed the officials to make announcements and verify whether any pilgrim needs lockers in PACs and allot them accordingly on availability. 

SE 2 Sri Satyanaryaana, EE s Sri Venugopal, Sri Srinivasulu, DE Electrical Sri Chandrasekhar, DyEO R2 Sri Harindranath, VGOs Sri NTV Ram Kumar, Sri Surendra, AEO Sri Naidu and other officials were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సిఆర్ఓ మరియు సప్తగిరి వసతి సముదాయాల వద్ద టీటీడీ ఈవో తిణిఖీలు

తిరుమల, 2024 ఆగష్టు 17: తిరుమలలోని సప్తగిరి సత్రాలు, సిఆర్ఓ కార్యాలయాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్‌లతో కలిసి శనివారం తనిఖీలు చేశారు.

మొదట సప్తగిరి సత్రాలు వద్ద గదులను పరిశీలించి కారిడార్లు, బాత్‌రూమ్‌లలో పరిశుభ్రత, స్విచ్‌బోర్డులు, జలప్రసాదం, పరుపులు, పరుపులు, మంచాలు, బెడ్‌షీట్లను ఆయన పరిశీలించారు. గదులను ఆధునీకరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, డీప్‌క్లీనింగ్‌ చేపట్టాలని అధికారులను ఈవో ఆదేశించారు. తరువాత యాత్రికులతో ఈవో మాట్లాడి కౌంటర్ల వద్ద గదుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు.

అనంతరం సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయంలో భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డు, ఇన్ఫర్మేషన్ కియోస్క్‌లను తనిఖీ చేయడంతోపాటు కర్ణాటక, కళ్లకురిచి నుంచి వచ్చిన భక్తులతో ఈవో మాట్లాడారు.

భక్తుల సౌకర్యార్థం తిరుమలలో ఎన్నీ గదులు అందుబాటులో ఉన్నాయనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పిఎసిలలో యాత్రికులకి లాకర్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే విషయం అనౌన్స్‌మెంట్లు చేయాలని, తద్వారా వాటి లభ్యతను బట్టి అవసరమున్న భక్తులకు కేటాయించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ 2 శ్రీ సత్యనారాయణ, ఈఈలు శ్రీ వేణుగోపాల్, శ్రీ శ్రీనివాసులు, డీఈ (ఎలక్ట్రికల్) శ్రీ చంద్రశేఖర్, డిప్యూటీ ఈవో ఆర్2 శ్రీ హరీంద్రనాథ్, విజిఓలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఏఈవో శ్రీ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.