EO INSPECTS GALLERIES _ నాలుగుమాడ వీధులు పరిశీలించిన ఈఓ డా. జవహర్ రెడ్డి.

Tirumala, 11 Oct. 20: TTD EO Dr KS Jawhar Reddy along with Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti inspected the ongoing arrangements for Navaratri Brahmotsvams in Tirumala on Sunday.

As part of the inspection, he visited the Vahana Mandapam from where the procession of Vahana Sevas commences and also galleries in four mada streets. 

He has also seen the markings of social distancing in galleries, entry and exit point in galleries etc.and made some suggestions over the arrangements in the galleries.

CE Sri Ramesh Reddy, Additional CVSO Sri Siva Kumar Reddy, Temple DyEO Sri Harindranath, Addl SP Sri Muniramaiah, EE Sri Jaganmohan Reddy, Health Officer Dr RR Reddy, VGOs Sri Manohar, Sri Prabhakar, DSP Prabhakar and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 నాలుగుమాడ వీధులు పరిశీలించిన ఈఓ. డా. జవహర్ రెడ్డి.

తిరుమల. 11 అక్టోబర్ 2020: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయ నాలుగుమాడ వీధులు పరిశీలించారు. వాహన మండపం, గ్యాలరీలో భౌతిక దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లు ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులు గ్యాలరీల్లోకి వచ్చే మార్గాలు, బయటికి వెళ్లే మార్గాలను పరిశీలించారు. భక్తులు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారని అధికారులను అడిగి తెలుసుకుని వారికి సూచనలు చేశారు.

అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి, సీవీఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, అదనపు సీవీఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఈఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ హరీంద్ర నాథ్, అదనపు ఎస్పీ శ్రీ మునిరామయ్య తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది