EO INSPECTS QUEUE LINES IN TIRUMALA _ క్యూలైన్లను పరిశీలించిన తితిదే ఇ.ఓ
క్యూలైన్లను పరిశీలించిన తితిదే ఇ.ఓ
తిరుమల, 05 ఆగష్టు 2013 : తిరుమలలో సోమవారం నాడు పలు దర్శనం క్యూలైన్లను తితిదే ఇఓ శ్రీ ఎం.జి.గోపాల్ తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు, సివిఎస్‌ఓ శ్రీ జి.వి.జి. ఆశోక్‌కుమార్ మరియు ఇతర అధికారులతో కలిసి తనిఖీచేసారు.
ఈ సందర్భంగా ఇఓ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని రూ.300/-, రూ.50/-, సర్వదర్శనం మరియు దివ్యదర్శనం క్యూలైన్లను పరిశీలించారు. భక్తులు తమ వంతు దర్శనం కోసం వేచియుండే కంపార్టుమెంట్లలో లైట్లు మరియు ఫ్యాన్ల వసతిని తనిఖీ చేశారు. అనంతరం శ్రీవారి ఆలయం లోపల రంగనాయకుల మండపం వెనుక నుండి వెళ్ళే క్యూలైన్లలో వెలుతురు సౌకర్యాన్ని పరిశీలించారు. అటు తరువాత పరకామణి జరుగుతున్న తీరును పరిశీలించారు.
అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల కలిసిన విలేకరులతో మాట్లాడుతూ దాదాపు 8 సంవత్సరాల క్రిందట వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో మరియు రంగనాయకుల మండపం వెనుక గల క్యూలైన్లో అంతగా వెలుతురు సౌకర్యం వుండేది కాదన్నారు. కాని ఇప్పుడు చక్కటి వెలుతురు మరియు గాలి సౌకర్యం ఉండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లు కూడా సజావుగా ముందుకు సాగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ తనిఖీలో తితిదే ముఖ్య ఇంజనీరు శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, అదనపు ముఖ్యనిఘామరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్.ఇ-2 శ్రీ రమేశ్ రెడ్డి, డిప్యూటీ ఇఇ శ్రీ రవిశంకర్‌రెడ్డి, తిరుమల ఆలయ డిప్యూటీ ఇఓ శ్రీ చిన్నంగారి రమణ, ఎ.వి.ఎస్.ఓ.లు శ్రీ మల్లిఖార్జునరావు, శ్రీ కోటేశ్వరరావులు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.