EO INSPECTS SRI SRINIVASA DIVYANUGRAHA HOMAM ARRANGEMENTS _ నవంబరు 23 నుంచి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హ విశేషహోమం

EO INSPECTS SRI SRINIVASA DIVYANUGRAHA HOMAM ARRANGEMENTS

 

TIRUPATI, 16 NOVEMBER 2023: TTD EO Sri AV Dharma Reddy on Thursday inspected the ongoing arrangements with concerned officials at Alipiri Go Mandiram.

 

In its mission to take forward Hindu Sanatana Dharma in a big way, the TTD board has resolved to commence Sri Srinivasa Divyanugraha Homam from November 23 onwards at Alipiri Go Mandiram.

 

Speaking to the media the EO said initially 50 tickets each online and offline will be released and virtually any number of pilgrims shall participate in the Homam every day. The price of the ticket is fixed as Rs.1000 on which two persons will be allowed.

 

This religious ritual will be performed under the aegis of SV Vedic University every day as a Nitya Homam for the well-being of devotees. Soon a permanent Homa Vedika will be constructed, he maintained.

 

In the inspection JEOs Smt Sada Bhargavi, Sri VVeerabrahmam, CVSO Sri Narasimha Kishore, SVVU VC Sri Rani Sadasiva Murthy, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy, Deputy CF Sri Srinivas, Dy Director Garden Sri Srinivasulu, and others participated.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నవంబరు 23 నుంచి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హ విశేషహోమం

– వేదిక‌ను ప‌రిశీలించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2023 నవంబరు 16: హిందూ సనాతన ధర్మప్ర‌చారంలో భాగంగా అలిపిరిలోని సప్త గోప్ర‌ద‌క్షిణ‌ మందిరంలో నవంబరు 23వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హ విశేషహోమం ప్రారంభ‌మ‌వుతుంద‌ని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్దగ‌ల స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణ మందిరంలో శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం వేదిక‌ను టీటీడీ ఈవో అధికారుల‌తో క‌లిసి గురువారం ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, సామాన్య భ‌క్తులు హోమం, యాగం నిర్వ‌హించ‌డం చాలా ఖ‌ర్చుతో కూడుకునింద‌న్నారు. కావున భ‌క్తుల‌ కోరిక మేర‌కు శ్రీవారి పాదాల వ‌ద్ద‌ త‌మ శుభ‌కార్యాలు, విశేష‌మైన రోజుల్లో స్వామివారి అనుగ్ర‌హం కోసం సంక‌ల్పం చెప్పుకుని య‌జ్ఞం నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు.

ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆధ్వ‌ర్యంలో అనునిత్యం ఈ హోమం నిర్వ‌హించ‌నున్న‌ట్లు, త్వ‌ర‌లో శాశ్వ‌త హోమ వేదిక‌ను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ఈ విశేషహోమంలో పాల్గొనే గృహ‌స్తులకు (ఇద్ద‌రు) టికెట్ ధర రూ.1000/-గా నిర్ణయించామ‌న్నారు. ప్ర‌తి రోజు 50 టికెట్లు ఆన్‌లైన్‌లో, 50 టికెట్లు ఆఫ్‌లైన్‌లో, వ‌ర్చువ‌ల్ టికెట్లు ఎంత మందైన కోనుగోలు చేసి పాల్గొనవ‌చ్చ‌ని ఈవో వివ‌రించారు.

ఈవో వెంట జేఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్‌ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ సిఎఫ్ శ్రీ శ్రీనివాస్, ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.