EO INSPECTS TEMPLE, VQC _ శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి క్యూలైన్లను పరిశీలించిన టిటిడి ఈవో

Tirumala, 28 June, 2017: TTD EO Sri AK Singhal along with Rituals JEO Sri KS Sreenivasa Raju and CVSO In-charge Sri G Srinivas inspected Vendi Vakili and VQC compartments.

The EO personally monitored the movement of queue lines at vendi vakili and interacted with the pilgrims. He later inspected VQC compartments and verified the functioning of help desks, display boards etc.

The top brass officials of TTD also visited the point where it was proposed to shift the scanner from existing place adjacent to Mahadwaram to VQC 1.

SE2 Sri Ramachandra Reddy, VGOs Sri Ravindra Reddy, Smt Vimalakumari, Any Sadalakshmi, DyEO Sri Kodandarama Rao and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి క్యూలైన్లను పరిశీలించిన టిటిడి ఈవో

తిరుమల, 28 జూన్‌ 2017: శ్రీవారి ఆలయంలోని వెండి వాకిలి వద్ద ఇటీవల ఏర్పాటుచేసిన నూతన క్యూలైన్లను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం రాత్రి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ జి.శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. వెండి వాకిలి వద్ద తోపులాటను అరికట్టాలని భక్తులు చేసిన సూచన మేరకు నూతన క్యూలైన్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

నూతనక్యూలైన్‌ ఎంతమేరకు సౌకర్యవంతంగా ఉందనే విషయమై ఈవో పలువురు భక్తులను అడిగి తెలుసుకున్నారు. వెండి వాకిలిలోకి ప్రవేశించే సమయంలో, దాటుకుని లోపలికి వెళ్లే సమయంలో భక్తుల రాకపోకలను గమనించారు. తీర్థం, శఠారి ఇచ్చే ప్రాంతంలో ఏర్పాటుచేసిన నూతన క్యూలైన్లను పరిశీలించారు.

అంతకుముందు జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఇతర అధికారులతో కలిసి సాధారణ భక్తులతో పాటు వెండి వాకిలి క్యూలైన్లలోకి ప్రవేశించి వాస్తవ పరిస్థితిని పరిశీలించారు.

అనంతరం ఈవో, జెఈవో, సివిఎస్‌వో కలిసి ఆలయ మహద్వారం పక్కన గల స్కానింగ్‌ కేంద్రాన్ని వైకుంఠం క్యూకాంప్లెక్సు-1లో ఏర్పాటుచేసే ప్రతిపాదనపై పరిశీలన చేశారు. ఇక్కడి 26, 27, 28 కంపార్ట్‌మెంట్లలో టిటిడి అందిస్తున్న సేవలపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల పుస్తకాలను పరిశీలించారు. పాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, ఫోన్‌ వసతి తదితర సేవలకు సంబంధించి భక్తులు ఫిర్యాదు చేస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం తెలియజేసి పరిష్కారమయ్యేలా చూడాలని అక్కడున్న శ్రీవారి సేవకులకు ఈవో సూచించారు. కంపార్ట్‌మెంట్లలోని శ్రీకాకుళం, కావలి, బెంగళూరు, తమిళనాడు తదితర ప్రాంతాల భక్తులతో ముచ్చటించారు. వైకుంఠం క్యూకాంప్లెక్సు-2లోని 8వ కంపార్ట్‌మెంట్‌లో గల డిస్‌ప్లే బోర్డులలో 5 భాషల్లో వస్తున్న తాజా సమాచారాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈవో, జెఈవోల వెంట ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, విజివోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, శ్రీమతి విమలకుమారి, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, ఎవిఎస్‌వో శ్రీ కూర్మారావు, క్యాటరింగ్‌ అధికారి శ్రీ శాస్త్రి, డిఇ(ఎలక్ట్రికల్‌) శ్రీమతి సరస్వతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.