UPLOAD ALL TTD PUBLICATIONS ONLINE ON WEBSITE- TTD EO SINGHAL_ టిటిడి ప్రచురణలు అన్నింటిని ఆన్‌లైన్‌లో పొందుపరచాలి – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 6 August 2019: TTD Executive Officer, Sri Anil Kumar Singh today directed officials to upload all dharmic bhakti sangeet and cultural publications online for benefit of all devotees of Lord Venkateswara.

Speaking after a review at the administrative building on Tuesday the TTD EO said as of now 3700 TTD publications in seven categories were uploaded on the website besides the Sapthagiri magazine from its 1978 edition itself. Devotees could utilise all the online material by clocking the eBooks tirumala.org website.

He also directed officials to take up reprint of all popular TTD publications. He also instructed the TTD engineering department to complete the modernization of TTD kalyana mandapams and also new hostel buildings for TTD institutions on a war footing. He also wanted the senior TTD officials monitoring the local temples to ensure better and quality service to devotees. The flowers needed should be grown on the TTD temple lands at Kurukshetra. He advised officials to interact with various state governments early to send cultural teams to annual Brahmotsavams to show case the regional bhakti sangeet and art forms.

The EO also wanted the officials to utilize desi detergents and medicinal herbs in place of chemicals in cleaning operations and give a natural and desi touch to clean and green operations in the hill shrine. He directed the engineering department to make elaborate arrangements for the Garuda seva and also other events of annual Brahmotsavams scheduled in September-October, 2019.

Tirumala SO Sri AV Dharma Reddy, Tirupati JEO Sri P Besant Kumar, CVSO Sri Gopinath Jetty, FACAO Sri O Balaji, in charge CE Sri Ramachandra Reddy, and other officials participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ప్రచురణలు అన్నింటిని ఆన్‌లైన్‌లో పొందుపరచాలి – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2019 ఆగస్టు 06: టిటిడి ముద్రించిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక ప్రచురణలను ఆన్‌లైన్‌లో పాఠకులకు అందుబాటులో ఉంచాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో మంగళవారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఇప్పటివరకు 3,700 టిటిడి ప్రచురణలను 7 కేటగిరీలలో ఆన్‌లైన్‌లో ఉంచినట్లు తెలిపారు. అదేవిధంగా సప్తగిరి మాస పత్రిక 1978వ సంవత్సరం నుండి నేటి వరకు భక్తులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఆన్‌లైన్‌లోని పుస్తకాలను పాఠకులు ebooks.tirumala.org వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. కాగా భక్తుల నుండి విశేష స్పందన ఉన్న పుస్తకాలను పున: ముద్రించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

తిరుపతిలోని టిటిడి కల్యాణ మండపాలను ఆధునీకరించి త్వరగా భక్తులకు అందుబాటులోనికి తీసుకురావాలన్నారు. టిటిడి విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థుల కొరకు నూతనంగా నిర్మిస్తున్న హాస్టల్‌ భవనాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. టిటిడి స్థానిక ఆలయాలను పర్యవేక్షిస్తున్న సీనియర్‌ అధికారులు తరచు సమీక్షించుకుని ఆయా ఆలయాలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా చెన్నై, ఢిల్లీలలోని అనుబంధ ఆలయాలను సంబంధిత అధికారులు పర్యవేక్షించి తరచుగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. కురుక్షేత్రలోని శ్రీవారి ఆలయానికి అవసరమైన పుష్పాలను ఆలయ పరిధిలోనే మొక్కలను పెంచుకుని పుష్పాలను సమకుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీవారి బ్రహ్మూెత్సవాలలో కళా ప్రదర్శనలు ఇచ్చేందుకు వివిద రాష్ట్రాలకు చెందిన అధికారులతో సంప్రదింపులు జరిపి కళాకారులను ఆహ్వానించాలన్నారు.

తిరుమలలో పరిశుభ్రతకు ఉపయోగించే రసాయనాల స్థానంలో ప్రకృతి సిద్ధమైన జౌషదాలను ఉపయోగించాలన్నారు. తద్వారా పారిశుద్ధ్యం సహజసిద్దంగా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. శ్రీవారి బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో గరుడసేవ రోజున భక్తుల లగేజీ తరలింపుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా బ్రహ్మూెత్సవాలకు అవసరమైన ఇంజినీరింగ్‌ పనుల అనుమతులను తీసుకుని సకాలంలో పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఇన్‌చార్జ్‌ సిఇ శ్రీ జి.రామచంద్రరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.