EO REVIEWS ON ANNUAL BRAHMOTSAVAM ARRANGEMENTS _ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష

TIRUMALA, 18 AUGUST 2025: As the annual Brahmotsavams in Tirumala are scheduled from September 24 to October 02 this year, TTD EO Sri J Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdary held a review meeting at Annamaiah Bhavan in Tirumala on Monday evening.

The meeting was also attended by the District Collector Dr Venkateswar, SP Sri Harshavardhan Raju besides TTD JEO Sri Veerabrahmam, CV & SO Sri Muralikrishna.

Earlier, the EO discussed on the preparedness by each department of TTD in detail.

Highlights of the meeting:

The Honourable CM of AP Sri N Chandrababu Naidu offered pattu vastrams on behalf of the state government on the first day of annual brahmotsavams on September 24.

Garuda Seva on September 28 and Chakra Snanam on October 02

Bundobust, Security arrangements for the annual fete with a special focus on important days to be made in cordination with district police in temple, galleries and other places where there is heavy pilgrim interface

Temple rituals and vahana Sevas, engineering works, accommodation, Kalyana Katta, Annaprasadam, Sanitation and cleanliness measures by Health Department, decorations by Garden wing, Srivari Sevaks, publicity in media and social media, May I Help You centers, cultural programmes,  transportation by TTD and APSRTC, parking arrangements have also been discussed in detail.

TTD FACAO Sri Balaji, CE Sri Satyanarayana, Heads of various departments of TTD, APSRTC RM Sri Jagadeesh, officers from district administration,  and police department were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష

తిరుమల, 2025 ఆగస్టు 18: తిరుమలలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు జరుగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలారావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజులతో పాటు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి సోమవారం సాయంత్రం అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు

  రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 24న బ్రహ్మోత్సవాల తొలి రోజు పట్టు వస్త్రాల సమర్పణ.

  సెప్టెంబర్ 28న గరుడ సేవ, అక్టోబర్ 2న చక్రస్నానం.

  రద్దీ నిర్వహణకు రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఈవో ఆదేశం.

  అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహన రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని ఆదేశం.

  ఎక్కువమంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని ఆదేశం.

  ఆలయంలో, గ్యాలరీల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జిల్లా పోలీసులతో సమన్వయంతో భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈవో ఆదేశం.

  తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం.

  ఆలయ కైంకర్యాలు, వాహనసేవలు, ఇంజినీరింగ్ పనులు, వసతి గృహాలు, కల్యాణకట్ట, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, గార్డెన్ విభాగం అలంకరణలు, శ్రీవారి సేవకుల సేవలు, మీడియా & సోషల్ మీడియాలో ప్రచారం, మే ఐ హెల్ప్ యూ సెంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, టీటీడీ మరియు ఏపీఎస్ఆర్టీసీ తరఫున రవాణా సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చ జరిగింది.

ఈ సమావేశంలో టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏఓ శ్రీ బాలాజీ, సీఈ శ్రీ సత్యనారాయణ, ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీ జగదీష్, ఇతర టీటీడీ, పోలీసు, జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.