EO REVIEWS ON SRINIVASA SETU _ శ్రీనివాస సేతు పనుల పురోగతిపై ఈవో సమీక్ష

TIRUPATI, 12 APRIL 2023: TTD EO Sri AV Dharma Reddy along with TTD and Municipal officials reviewed on the status of Srinivasa Setu at his chamber in TTD Administrative Building on Wednesday.

 The EO directed the officials concerned to complete the works by May 31 and bring them to the public utility by June 15.

He also said the medians in between roads should be given to contractors for developing greenery. The pending works at the railway overbridge should ve completed and a precise report over the completion of 92% works to appraise the same in the upcoming board meeting.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, TMC Commissioner Smt Harita, CE Sri Nageswara Rao, FACAO Sri Balaji, TMC SE Sri Mohan, EE Sri Chandrasekhar, Smart City  Special Officer Sri Chandramouli were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీనివాస సేతు పనుల పురోగతిపై ఈవో సమీక్ష

తిరుపతి, 12 ఏప్రిల్ 2023: తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు ప్రాజెక్టు పనుల పురోగతిపై టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి బుధవారం టీటీడీ పరిపాలన భవనంలోని తమ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మే 31 నాటికి ప్రాజెక్టు మొత్తం పనులు పూర్తి చేసి జూన్ 15వ తేదీ నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కోరారు. రోడ్ల మధ్యలో మీడియన్స్ అభివృద్ధి కోసం అవసరమైన స్థలాన్ని వెంటనే కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద గ్రిడ్డర్స్ పనులను త్వరగా చేపట్టాలని కోరారు. ప్రస్తుతం పూర్తయిన 92 శాతం పనుల పురోగతిని వచ్చే బోర్డు సమావేశంలో తెలిపేందుకు వీలుగా సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు.

ఈ సమీక్షలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి డి.హరిత, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎఫ్ఏసిఎఓ శ్రీ బాలాజీ, కార్పొరేషన్ ఎస్ఇ శ్రీ మోహన్, ఈఈ శ్రీ చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి శ్రీ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.