EO REVIEWS ON SUMMER RUSH ARRANGEMENTS _ వేసవిలో భక్తుల రద్దీకి విస్తృత ఏర్పాట్లు- టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

TIRUMALA, 29 APRIL 2023: With the summer vacation pilgrim rush commencing from Sunday onwards, TTD EO Sri AV Dharma Reddy held a review meeting with all the HoDs of Tirumala at Annamaiah Bhavan on Saturday.

He directed the officials concerned to be available round the clock in the Hill Town at their respective areas to attend to the needs of the pilgrims during the ensuing peak summer period. The EO also instructed the concerned officials who have been on deputation to Tirumala till July 15, to monitor the activities closely and ensure that the pilgrims are not put to any sort of inconvenience. The EO also instructed the concerned HoDs to ensure that there is no dearth of service in providing water, annaprasadam in queue lines, complexes, compartments etc. 

The EO directed the PRO Dr T Ravi to invite enough number of Srivari Sevaks to offer services to the pilgrims at all the vital places in Tirumala where the pilgrim influx is more. “Allot Srivari Seva Supervisors to verify whether the pilgrims are getting Annprasadam, water, laddu prasadams etc. properly or not and furnish the feedback report from time to time to the concerned department to sort our issues if any”, he instructed. 

Later on he also discussed in detail on how to provide hassle free darshan to visiting pilgrims after Vendi Vakili. He asked former TTD CE and Advisor to TTD Sri Ramachandra Reddy, former DyEO temple Sri Prabhakar Reddy who have vast knowledge and experience in crowd management to suggest some concrete plan to overcome the issue in a couple of days.

The EO also asked the Tirumala Police to have a concrete Traffic Management Plan and ensure that there is no traffic congestion during the peak summer period for the next couple of months.

CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, ASP Tirumala Sri Muniramaiah, temple DyEO Sri Lokanatham and other HoDs of various departments in TTD and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వేసవిలో భక్తుల రద్దీకి విస్తృత ఏర్పాట్లు

– నిత్యం అప్రమత్తంగా సేవలందించండి

– టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

తిరుమల, 2023 ఏప్రిల్ 29: వేసవి సెలవుల రద్దీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు సన్నద్ధంకావాలని ఆయా విభాగాధిపతులను ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్యభవనంలో శనివారం టిటిడి సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మే 1 నుండి జులై 15వ తేదీ వరకు యాత్రికుల అవసరాలను తీర్చడానికి సంబంధిత విభాగాల అధికారులు 24 గంటలు తిరుమలలో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. తిరుమలకు జూలై 15వ తేదీ వరకు డిప్యూటేషన్‌పై వచ్చే సంబంధిత అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారివారికి విధులు కేటాయించిన ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ, సమస్యలు ఏవైనా ఉత్పన్నం అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే క్యూ లైన్లు, వైకుంఠం కాంప్లెక్స్‌లు, కంపార్ట్‌మెంట్లలో తాగు నీరు, అన్నప్రసాదం తదితర సేవలకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని సంబంధిత విభాగాధిపతులను ఈఓ ఆదేశించారు.

భక్తుల రద్దీకి తగినన్ని లడ్డూలు నిల్వ ఉంచుకోవాలన్నారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కళ్యాణకట్ట, సిఆర్వో, పిఏసీల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అవసరమైన ప్రాంతాలలో ఆదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు.

తిరుమలలో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే అన్ని కీలక ప్రదేశాల్లో భక్తులకు సేవలు అందించేందుకు తగిన సంఖ్యలో శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని పిఆర్ఓ డాక్టర్‌ టి.రవిని ఆదేశించారు. భక్తులకు అన్నప్రసాదం, నీరు, లడ్డూ ప్రసాదాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది పరిశీలించేందుకు శ్రీవారి సేవా పర్యవేక్షకులను కేటాయించాలని, సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు సంబంధిత శాఖకు ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని ఈఓ ఆదేశించారు.

అనంతరం దర్శనానికి వచ్చే భక్తులకు వెండి వాకిలి తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడంపై వివరంగా చర్చించారు. టీటీడీ విశ్రాంత సీఈ, టీటీడీ సలహాదారు శ్రీరామచంద్రారెడ్డి, రద్దీ నిర్వహణలో అపారమైన పరిజ్ఞానం, అనుభవం ఉన్న శ్రీవారి ఆలయ విశ్రాంత డిప్యూటీ ఈఓ శ్రీ ప్రభాకర్‌రెడ్డి కలిసి ఈ సమస్యను అధిగమించేందుకు కార్యాచరణ ప్రణాళికను రెండ్రోజుల్లో అందించాలని ఆయన కోరారు.

వేసవి కాలంలో తిరుమలకు విచ్చేసే భక్తులకు ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్య లేకుండా చూడాలని, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించాలని తిరుమల పోలీసులను ఈఓ కోరారు. వేసవిలో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై విభాగాల వారీగా పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో సివిఎస్‌వో శ్రీ నరసింహకిషోర్‌, సిఇ శ్రీ నాగేశ్వరరావు, తిరుమల ఎఎస్పీ శ్రీ మునిరామయ్య, ఆలయ
డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, ఇతర విభాగాధిపతులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.