EO SANCTIONS RS. 8.48CR FOR TEMPLE CONSTRUCTION _ శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా 11 ఆల‌యాల‌ నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరు

REVIEWS ON SRIVANI TRUST

 

Tirumala, 29 Jan. 22: TTD EO Dr KS Jawahar Reddy has sanctioned Rs. 8.48cr towards the construction of 11 temples through SRIVANI Trust across the state of Andhra Pradesh.

 

The EO reviewed the pace of works of the 11 temples whose construction is being taken under the SRIVANI Trust in collaboration with the AP Endowment department at his chambers in the TTD Administrative Building on Saturday.

 

Speaking on the occasion the TTD EO asked officials to focus on the rejuvenation of dilapidated historic temples and building shrines in the remote areas which had no temples as a part of TTD’s mission of spreading Hindu Santana Dharma in backward areas.

 

He informed the concerned to come out with a Master Data Base System to store the details of the temples which are being constructed jointly with SRIVANI funds of TTD and Common Good Fund (CGF) of Endowments Department of AP.

 

He also directed the officials to expedite the construction works of 50 temples, renovation and Jeernodharana of 84 temples and 42 Bhajan Mandirs under SRIVANI Trust.

 

TTD EO also reviewed the 1100 applications received from SC, ST and BC colonies across the state for constructing temples and said once the verification and validation of these applications are done by the Endowments Department, the construction works shall be commenced, he instructed the concerned.

 

JEO Sri Veerabrahmam, FA&CAO Sri O Balaji, Chief Engineer Sri Nageswara Rao, DyCE Sri Prasad, DyEO (General) Dr Ramana Prasad, Dharmic Projects Programming Officer Sri Vijayasaradhi were present.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా 11 ఆల‌యాల‌ నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరు

– శ్రీ‌వాణి ట్ర‌స్టుపై డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి స‌మీక్ష‌

తిరుమల, 2022 జ‌న‌వ‌రి 29: శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 11 ఆల‌యాల నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరుకు టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈ ట్ర‌స్టు ద్వారా చేప‌ట్టే 50 ఆల‌యాలు, 84 ఆల‌యాల‌ జీర్ణోద్ధ‌ర‌ణ‌, పున‌ర్నిర్మాణం, 42 భ‌జ‌న మందిరాల ప‌నుల‌ను వేగ‌వంతం చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈవో అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని త‌న కార్యాల‌యంలో శ‌నివారం ఆయ‌న శ్రీ‌వాణి ట్ర‌స్టుపై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టు, దేవాదాయ శాఖ సిజిఎఫ్ ద్వారా మంజూరు చేసే ఆల‌యాల నిర్మాణాల‌కు సంబంధించిన మాస్ట‌ర్ డేటాబేస్డ్ సిస్ట‌మ్ త‌యారుచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి కాల‌నీల్లో ఆల‌యాల నిర్మాణం కోసం అందిన 1100 ద‌ర‌ఖాస్తుల‌ను దేవాదాయ శాఖ ప‌రిశీల‌న‌కు పంపామ‌ని, ప‌రిశీల‌న పూర్తి కాగానే ఆల‌యాల నిర్మాణ‌ప‌నులు ప్రారంభించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈవో అన్నారు.

వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో స‌నాత‌న హిందూ ధ‌ర్మాన్ని మ‌రింత వ్యాప్తి చేయ‌డంలో భాగంగా పురాత‌న ఆల‌యాల పున‌ర్నిర్మాణం, ఆల‌యాలు లేనిచోట ఆల‌యాల నిర్మాణంపై దృష్టి పెట్టాల‌న్నారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌ను ఆధ్యాత్మిక మార్గం వైపు న‌డిపించేందుకు అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ఈవో అభిప్రాయ‌ప‌డ్డారు. దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్‌తో చ‌ర్చించి శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా నిధులు మంజూరు చేసిన ఆల‌యాల నిర్మాణం, పున‌ర్నిర్మాణం, జీర్ణోద్ధ‌ర‌ణ ప‌నులు స‌కాలంలో పూర్తి చేయించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. ఆల‌యాల నిర్మాణానికి సంబంధించి వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌పై స‌మీక్షించారు. త‌దుప‌రి చ‌ర్య‌లపై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

ఈ స‌మీక్ష‌లో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, డెప్యూటీ ఈవో జ‌న‌ర‌ల్ డా. రమ‌ణ‌ప్ర‌సాద్‌, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి శ్రీ లంక విజ‌య‌సార‌ధి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.