EO THANKS VEGETABLE DONORS WHO CONTRIBUTED VEGGIES WORTH ALMOST Rs.200Cr IN THE LAST 18 YEARS TO TTD- _ అన్నప్రసాద కూరగాయల దాతల సేవలు అపురూపమైనవి

ENCOURAGE ORGANIC VEGGIES TOO – EO TO DONORS

 

MEETING SOON WITH NATURAL FARMERS

 

TIRUMALA, 06 SEPTEMBER 2022: While thanking the humongous contributions of Vegetable Donors hailing from different states to TTD Annaprasadam on various important occasions, which touched almost Rs.200 crores so far since 2004, TTD EO Sri AV Dharma Reddy sought them, also to encourage a donation of organic veggies so as to provide a nutritional and healthy diet to the multitude of visiting pilgrims to Tirumala every day.

 

A meeting with all the vegetable donors was held at Annamaiah Bhavan in Tirumala on Tuesday to discuss on the veggies to be supplied for the ensuing annual brahmotsavams as it is an usual practice to hold a meeting ahead of the annual fete with vegetable donors by TTD every year.

 

Addressing the donors, the EO said, TTD has already began making Srivari Anna Prasadams with the cereals produced out of “Go Adharita Vyavayasayam” since last May. “With an aim to encourage the traditional way of farming, TTD has been donating cows (unmilched) and oxen to the farmers to grow the Agri products through natural farming techniques. As we have slowly increased the donation of vegetables with one donor in 2004 to 17 standard vegetable donors today apart from many others, there is a need to encourage our traditional farming produce also. We are now purchasing a dozen organic products through Mark Fed which includes 7000 tonnes of rice and 2600 tonnes of BG Dal and other cereals by paying more than MSP to organic farmers which is yielding good results. Similarly, we want to encourage organic veggies also in a phased manner”, he maintained.

 

EO also said a meeting with organic farmers will also be conducted soon on how to get organic vegetables for TTD Annaprasadams.

 

Earlier, Deputy EO Incharge for Annaprasadam Sri Selvam and Special Officer for Catering Sri GLN Sastry explained the EO, that the donors are willing to supply leafy vegetables also for the ensuing brahmotsavams this year.  Upon the instructions of EO, this year Annaprasadam wing is also are preparing a menu chart, to be served with varieties of delicacies among pilgrims every day, they added.

 

Later the Vegetable donors were felicitated by EO on the occasion.

 

Vegetable Donors from AP, Telangana, Tamilnadu, Karnataka and Organic farmers,  AEO Annaprasadam Sri Gopinath are also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నప్రసాద కూరగాయల దాతల సేవలు అపురూపమైనవి

– గో ఆధారిత సహజ కూరగాయల ఉత్పత్తులను ప్రోత్సహించండి

– దాతలకు టీటీడీ ఈవో పిలుపు

– సేంద్రియ రైతులతో త్వరలో సమావేశం

తిరుమ‌ల‌, 2022 సెప్టెంబ‌రు 06: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఏనాడు ఏ కొరతా రాకుండా 2004 నుండి ఇప్పటివరకు దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువైన కూర‌గాయ‌లను వివిధ రాష్ట్రాల నుండి టీటీడీ అన్నప్రసాద వినియోగానికి వివిధ సందర్భాల్లో అందించిన కూరగాయల దాత‌ల‌కు ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం కూరగాయల దాతల‌తో సమావేశం నిర్వహించారు. రానున్న బ్రహ్మోత్సవాలకు సరఫరా చేయాల్సిన కూరగాయలపై చర్చించేందుకు టీటీడీ ప్రతి సంవత్సరం కూరగాయల దాతలతో ముందుగా సమావేశం నిర్వహించడం ఆనవాయితీ.

దాతలను ఉద్దేశించి ఈవో మాట్లాడుతూ, ప్రతిరోజూ తిరుమలకు వచ్చే భక్తులకు పౌష్టికాహారం మరియు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు సేంద్రియ కూరగాయల విరాళాన్ని ప్రోత్సహించాలని కూరగాయల దాతలను కోరారు. గత మే నెల నుంచి ‘గో ఆధారిత వ్యవసాయం’ ద్వారా ఉత్పత్తి చేసిన తృణధాన్యాలతో శ్రీవారి అన్నప్రసాదాల తయారీని టీటీడీ ఇప్పటికే ప్రారంభించిందన్నారు. “సాంప్రదాయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో, సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పండించడానికి టీటీడీ రైతులకు ఆవులు (పాలు ఇవ్వ‌ని) మరియు ఎద్దులను దానం చేస్తోంద‌ని చెప్పారు. టీటీడీ 2004లో ఒక దాతతో కూరగాయల విరాళాన్ని ప్రారంభించి, నేడు 17 మందికి పైగా దాతలు నిరంత‌రం కూర‌గాయ‌లు అందిస్తున్నారన్నారు. మన సాంప్రదాయ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంద‌న్నారు.

టీటీడీ ఎపి మార్క్ ఫెడ్ ద్వారా 12 ర‌కాల సేంద్రియ‌ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామ‌ని, ఇందులో 7000 టన్నుల బియ్యం, 2600 టన్నుల శెన‌గ పప్పు మరియు ఇతర తృణధాన్యాలు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. సేంద్రీయ రైతులకు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఆదాయం వ‌స్తోంద‌ని, ఇది మంచి ఫలితాలను ఇస్తోంద‌న్నారు. అదేవిధంగా టీటీడీ సేంద్రీయ కూరగాయలను కూడా దశలవారీగా ప్రోత్సహించ‌నున్న‌ట్లు ” ఆయన చెప్పారు.

టిటిడి అన్నప్రసాదాలకు సేంద్రియ కూరగాయలు ఎలా పొందాలనే అంశంపై త్వరలో సేంద్రియ రైతులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.

అంతకుముందు అన్నప్రసాదం ఇన్‌చార్జి డెప్యూటీ ఈవో శ్రీ సెల్వం, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ జీఎల్‌ఎన్ శాస్త్రి ఈవోకు కూర‌గాయ‌ల విరాళాల‌ను గురించి వివరించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు దాతలు ఆకు కూరలు కూడా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈవో ఆదేశాల మేరకు ఈ ఏడాది అన్నప్రసాదం విభాగం మెనూ చార్ట్‌ను కూడా తయారుచేస్తోందని, ప్రతిరోజూ యాత్రికులకు వివిధ రకాల వంటకాలతో వడ్డిస్తున్నామని వారు తెలిపారు. అనంతరం కూరగాయల దాతలను ఈవో సన్మానించారు.

ఆంధ్ర‌, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుండి కూరగాయల దాతలు మరియు సేంద్రియ రైతులు, అన్నప్రసాదం ఏఈవో శ్రీ గోపినాథ్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.