EO VISITS MAHA EXHIBITION _ శ్రీవారి బ్రహ్మోత్సవ మహాప్రదర్శనను పరిశీలించిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirumala, 2 Oct. 19: TTD EO Sri Anil Kumar Singhal visited the Maha Exhibition on Wednesday evening.
Later speaking to media persons, he said all the departments have done elaborate arrangements in Maha Exhibition which is attracting a huge number of visitors every day.
Garden Wing Deputy Director Sri Srinivasulu, PRO Dr T Ravi were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవ మహాప్రదర్శనను పరిశీలించిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
తిరుమల, 2019 అక్టోబరు 02: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల కల్యాణవేదికలో ఏర్పాటు చేసిన శ్రీవారి బ్రహ్మోత్సవ మహాప్రదర్శనను బుధవారం ఉదయం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ స
సింఘాల్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి భక్తులను ఆకట్టుకునేలా టిటిడిలోని అన్ని విభాగాల మహాప్రదర్శనను ఏర్పాటు చేశారన్నారు. ప్రత్యేకంగా శ్రీ అత్తి వరదరాజస్వామివారి మూడు భంగిమల్లో నిసెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకర్షిస్తుందన్నారు.
ముందుగా శ్రీమహావిష్ణువు గరుడినిపై వస్తున్న విధంగా రూపొందించిన సైకత శిల్పం, స్వామివారి చిత్రాలు, వాహనసేవలు, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, తిలకించారు. ప్రత్యేక పుస్తక ప్రదర్శన, సూక్ష్మ కళా చిత్ర ప్రదర్శన, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జౌషధాల ప్రదర్శన, టిటిడి ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో భక్తులను ఆకర్షించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. నాడు నేడు పేరిట తిరుమల చరిత్రను తెలిపే ఫోటోలు, టిటిడి ఉత్సవాలు, పంచబేరాలు, అలిపిరి నుండి అఖిలాండం వరకు గల విశేషాలు, శ్రీవారి ఆలయంలోని మండపాలు, ఘాట్ రోడ్ల ఫోటోలను పరిశీలించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.