EVENNING VAHANA SEVAS IMMERSE DEVOTEES IN DEVOTIONAL WAVES _ కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీ మలయప్ప కటాక్షం

కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీ మలయప్ప కటాక్షం

తిరుమల, 2024, ఫిబ్ర‌వ‌రి 16: సూర్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారంనాడు తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులను కటాక్షించారు.

కల్పవృక్ష వాహనం(సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు)

శ్రీమలయప్పస్వామివారు  ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

సర్వభూపాల వాహనం(సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు)

సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారు.

చంద్రప్రభ వాహనం(రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు)

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్పీ శ్రీమతి మలికా గార్గ్ ఇతర అధికారులు వాహన సేవలో పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 16 February 2024: The Vahana Sevas are classified into two with first four before Chakra Snanam and the next three after on Friday.

The second half of Vahana Sevas commenced with Kalpavriksha Vahanam.

KALPAVRIKSHA VAHANAM (4 pm to 5 pm)

Sri Malayappa Swamy along with His two Consorts, Sridevi and Bhudevi bless the devotees on the Kalpavriksha vahanam in the four Mada streets of the temple in the evening.  Kalpavriksha is one of the precious objects that originated in Ksheera Sagara Mathanam in the form of a wish-fulfilling divine tree. 

It is the belief of the devotees that Srivaru will grant the desired boons by having His darshan on the Kalpa Vriksha Vahanam.

SARVABHUPALA VAHANA(6 pm to 7 pm)

Sarvabhupala means the king of the universe.  It means that Srivaru is the king of all rulers.  Indra to the east, Agni to the south-east, Yama to the south, Niruti to the south-west, Varuna to the west, Vayu to the north-west, Kubera to the north and Parameshwara to the north-east are the eight rulers.  All of them serve Swami on their shoulders and in their hearts.  Thus Swami is conveying the message that people will be blessed under their rule who will be acting as per His directives.

CHANDRAPRABHA VAHANAM (8 to 9 pm)

Moon is often considered as Sasyakaraka. Lilies bloom when the moon rises.  Devotees are excited when they witnessed Lord on Chandraprabha vahanam. 

The Sapta Vahana Sevas culminated with Sri Malayappa Swamy on the soothing Chandraprabha Vahanam.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI