EX-GRATIA AMOUNT OF Rs.10 LAKHS PAID TO LEOPARD VICTIM LAKSHITA PARENTS _ లక్షిత తల్లిదండ్రులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు
Tirumala, 04 September 2023: An ex-Gratia amount of ₹10 lakhs was paid to parents of six-year old girl Lakshita who was killed in a Leopard attack on the Alipiri footpath August 11.
The girl was a resident of Pothireddypalem village in Kovur mandal of Nellore district.
The incident took place when the girl was trekking with her parents Sri Venkata Dinesh and Sasikala, along the Alipiri pedestrian route.
As announced earlier, an Ex-Gratia of Rs 5 lakh from TTD and another Rs 5 lakh from AP Forest Department were handed over to the Lakshitha’s parents from the hands of by Kovur MLA Sri Prasanna Kumar Reddy on Monday.
TTD Deputy CF Sri Sreenivasulu and District Forest Officer Sri Satish were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
లక్షిత తల్లిదండ్రులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు
తిరుమల, 2023 సెప్టెంబరు 04: అలిపిరి కాలిబాట మార్గంలో ఆగస్టు 11న చిరుత దాడిలో మృతి చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత తల్లిదండ్రులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బాలిక తన తల్లిదండ్రులు శ్రీ వెంకట దినేష్, శ్రీమతి శశికళతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమలకు వెళుతుండగా ఈ సంఘటన జరిగిన విషయం విదితమే.
ముందుగా ప్రకటించినట్లుగా సోమవారం లక్షిత తల్లిదండ్రులకు టీటీడీ నుంచి రూ.5 లక్షలు, ఏపీ అటవీశాఖ నుంచి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను కోవూరు ఎమ్మెల్యే శ్రీ ప్రసన్నకుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
టీటీడీ డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులు, తిరుపతి డిఎఫ్ఓ శ్రీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.