EXCLUSIVE PAEDIATRIC HOSPITAL SOON IN TIRUPATI-TTD CHAIRMAN _ నవంబర్ 14 లోగా టీటీడీ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 

Tirupati, 27 Aug. 20: Considering the necessity and importance of children Medicare, TTD is mulling for an exclusive super specialty hospital in Tirupati which will become a boon to treat the children suffering from chronic diseases, said TTD Trust Board Chief Sri YV Subba Reddy.

The BIRRD Committee and Medical Committee meeting was held in the meeting hall of BIRRD Ortho Hospital in Tirupati on Thursday along with Executive Committee members Sri Govinda Hari, Sri Muralikrishna, Sri Siva Shankar, TTD JEO Sri P Basanth Kumar and BIRRD Director Dr Madan Mohan Reddy and CMO Dr. Narmada.

After the meeting, the Chairman said, after bifurcation of the State, there is no specialized Hospital for children Medicare. Our Honourable CM Sri YS Jagan Mohan Reddy thought of this idea for having an exclusive super specialty hospital for the sake of children in Andhra Pradesh. The Kanchi Kamakoti Children Trust Hospital will provide the required guidance to commence this Children’s Hospital. The Bhoomi puja towards the construction works for the Children’s Hospital will be done over the hands of AP CM before November 14 and the pediatric services will commence simultaneously from the same day in the Old Hospital Block in BIRRD till new the building is constructed. Once the Hospital is established in Tirupati, Cardiac and Bone Marrow transplantation surgeries will be taken up”, he added.

Earlier, a detailed Power Point Presentation was presented on the status of Paediatric Hospitals across the country, the trauma the children are undergoing due to lack of enough specialty hospitals etc by a team of Doctors from Kanchi Trust. 

The Chairman directed the Chief of AP Medical Services and Infrastructure Development Corporation Limited, Dr Chandrasekhar Reddy to submit a Detailed Project Report on the infrastructure, equipment and other medical gadgets required for the Paediatric Super Specialty Hospital. “With the available resources, Tirupati will emerge as Medical Tourism Centre in future”, he added.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబర్ 14 లోగా టీటీడీ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 

– సి ఎం తో శంఖుస్థాపన  
– అదే రోజు నుంచి రోగులకు సేవ లు :  టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి                                

 తిరుప‌తి, 2020 ఆగ‌స్టు 27: టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 14వ తేదీ లోగా 100 పడకల చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని బర్డ్ ఆసుపత్రి భవనాల్లో ప్రారంభిస్తామని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆలోపు సిఎం శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తో ఆసుపత్రి సొంత భవనాల నిర్మాణానికి శంఖుస్థాపన చేయించి, అదే రోజు నుంచి వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. బర్ద్ ఆసుపత్రి లో గురువారం టీటీడీ మెడికల్ కమిటీ సమావేశం జరిగింది. 

ముఖ్యమంత్రి ఆదేశం మేరకు చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు. బర్డ్ పాత బ్లాక్ భవనంలో ఆసుపత్రి ప్రారంభానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. ఆ తరువాత రెండు నుంచి రెండున్నరేళ్లలో  కొత్త భవనాల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న‌పిల్ల‌ల ఆసుపత్రిలో గుండె, బోన్ మారో సర్జరీలు  చేస్తామన్నారు. రాష్ట్రంలో చిన్న పిల్లలకు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదనే ముందు చూపుతో సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. కంచి ట్రస్ట్ చిన్న పిల్లల ఆసుపత్రి వైద్య నిపుణుల సేవలు, సలహాలు తీసుకుంటున్నామని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు. 

ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని  గిరిజన ప్రాంతాల పిల్లలకు  బోన్ మారో సర్జరీలు ఎక్కువగా అవసరం అవసరం అవుతున్నాయని డాక్టర్లు చెప్పారని చైర్మన్ తెలిపారు. సిఎం తో మాట్లాడి రెండవ దశలో విశాఖపట్నంలో కూడా చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఆలోచన చేస్తామన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి  రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.  ఆసుపత్రి ఏర్పాటు, అందులో వైద్య పరికరాలు, ఇతర వసతులకు సంబంధించి ప్రభుత్వానికి, టీటీడీకి  డిపిఆర్ అందించాలని వైద్య మౌళిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చంద్ర శేఖర్ రెడ్డిని చైర్మన్ కోరారు.  కంచి ట్రస్ట్ చిన్న పిల్లల ఆసుపత్రి వైద్య నిపుణులు తిరుపతి లో ఏర్పాటు చేయబోయే ఆసుపత్రి ఎలా ఉండాలి, వైద్య పరికరాలు, ఇతర అవసరాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. భవిష్యత్ లో తిరుపతి మెడికల్ టూరిజం సెంటర్ అయ్యేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి చెప్పారు. టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ గోవింద హరి, శ్రీ మురళి కృష్ణ,   జెఈవో శ్రీ బసంత్ కుమార్, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, సి ఎం ఓ డాక్టర్ నర్మద పాల్గొన్నారు. పాలకమండలి సభ్యులు శ్రీ  శివ శంకర్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. కోవిడ్ తో బాధపడుతున్న ఉద్యోగులకు నాణ్యమైన చికి అందించడం లో ఖర్చుకు వెనుకాదొడ్డని అధికారులను చైర్మన్ ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగులకు అర్హత మేరకు వైద్య ఖర్చుల బిల్లులు జాప్యం లేకుండా చెల్లించాలని ఆదేశించారు.

జనరిక్ మందులే అమ్మేలా చర్యలు   

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్, బర్డ్ ఆస్పత్రులలోని మెడికల్ షాపు ల్లో జనరిక్ మందులు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. బర్డ్ ఆసుపత్రిలో ని జనరిక్ మందుల షాపు ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఎంఆర్‌పి ధరలు, రోగులకు ఇస్తున్న ధరలను పరిశీలించారు. ఈ మందులు  50 శాతం దాకా తక్కువ ధరకు వస్తున్నందువల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. టీటీడీ కి చెందిన ఆసుపత్రుల్లోని అన్ని మెడికల్ షాపుల్లో ఈ మందు లే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జెఈవో శ్రీ బసంత్ కుమార్ ను ఆదేశించారు. టీటీడీ ఆసుపత్రుల్లో కూడా వీటినే ఉపయోగించాలని అన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.