EXOTIC CLIMBERS TO BEAUTIFY GHAT ROAD_ భక్తులకు ఆహ్లాదం… జోరుగా మొక్కల పెంపకం…ఆకర్షణీయమైన రంగులు, సువాసనలు వెదజల్లే పూలు

Tirumala, 08 April 2018:With an intention to provide aesthetic on both the footpath routes, TTD has taken up beautification works by growing exotic climbers.

Currently the works are going on at Alipiri Padala Mandapam to GNC toll gate and 1.5km stretch at Elephant Arch in first ghat road in the first phase.

Both sides of Alipiri footpath is set to get an attractive look with climbers like Clematis, Passy flora, Viscaria etc.

At Elephant Arch, Ixora, Begonia, Statodia flower species brought from the famous Kadiam Nursery were grown. Seperate pipeline to water these plants and climbers was also set up.

While in the second phase, plantation of exotic and decorative plants will be taken up Second Ghat, Srivari Mettu and Outer Ring Road areas.

The footpath greenery programme is going on under the supervision of FROs Sri Siva kumar in Tirupati and Sri Nagendra in Tirumala.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భక్తులకు ఆహ్లాదం… జోరుగా మొక్కల పెంపకం…ఆకర్షణీయమైన రంగులు, సువాసనలు వెదజల్లే పూలు

ఏప్రిల్‌ 08, తిరుమల 2018; శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఆహ్లాదం పంచేందుకు అలిపిరి నడకమార్గం, మొదటి ఘాట్‌ రోడ్డులో జోరుగా పూల మొక్కల పెంపకం సాగుతోంది. ఇందులో తీగజాతికి చెందిన ఆకర్షణీయమైన రంగురంగుల పూలమొక్కలు, సువాసనలు వెదజల్లే పూలమొక్కలు ఉన్నాయి. ప్రస్తుతం అలిపిరి పాదాలమండపం నుండి జిఎన్‌సి టోల్‌గేట్‌ వరకు మెట్లకు ఇరువైపులా, మొదటి ఘాట్‌ రోడ్డులో ఎలిఫెంట్‌ ఆర్చి సమీపంలో 1.5 కిలోమీటర్ల పొడవునా పూలమొక్కల పెంపకం పనులు జరుగుతున్నాయి.

మెట్ల మార్గంలో తీగ జాతికి చెందిన క్లమాటిస్‌(గౌరికుంతల), ప్యాసిఫ్లోర, విస్‌కాలిస్‌(రాధామనోహరం), మల్లెజాతికి చెందిన నైట్‌క్వీన్‌ పూలమొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలు నడకమార్గంలోని స్తంభాలకు అల్లుకునేలా, పైకప్పు పైకి పెరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా సువాసన వెదజల్లే సంపంగి, ముర్రయ, మనోరంజితం మొక్కలు పెంచుతున్నారు. మొదటి ఘాట్‌ రోడ్డులో ఎలిఫెంట్‌ ఆర్చి సమీపంలో రోడ్డుకు ఒకవైపు కాగితపు పూలు, సువర్ణ గన్నేరు, బాగునీయ, స్టటోడియా, గన్నేరు పూల మొక్కలు పెంచుతున్నారు. రాజమండ్రి సమీపంలోని కడియం నర్సరీ నుండి ఈ మొక్కలను కొనుగోలు చేశారు. మొక్కల పెంపకానికి అనువుగా నీటి పైపులైన్లు ఏర్పాటుచేశారు.

రెండో దశలో శ్రీవారిమెట్టు, రెండో ఘాట్‌ రోడ్డు, తిరుమలలోని రింగ్‌ రోడ్డు ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పూల మొక్కల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. తిరుమల పరిధిలో ఎఫ్‌ఆర్‌వో శ్రీ శివకుమార్‌, తిరుపతి పరిధిలో ఎఫ్‌ఆర్‌వో శ్రీ నాగేంద్ర మొక్కల పెంపకం పనులను పర్యవేక్షిస్తున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.