EXPEDITE GOLD PLATING WORK AT SRI GT- TTD JEO _ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ విమానగోపురం బంగారు తాపడం పనుల వేగం పెంచాలి- అధికారులకు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం ఆదేశం

Tirupati,14 December 2022: TTD JEO Sri Veerabrahmam has directed the officials concerned to speed up the gold plating works of Sri Govindaraja Swamy temple Gopuram and complete the works on war footing as per schedule.

 

He inspected the jewellery wing of TTD at Sri Govindaraja Swamy temple along with FA &CAO Sri Balaji and CE Sri Nageswara Rao on Wednesday and also the ongoing gold lacing works.

 

Officials informed the JEO that 50 gold smiths were deployed for the task. JEO  asked the CE to organise as many as five workshops needed for goldsmiths by shifting the offices in the temple to speed up works.

 

During his tour, JEO also interacted with goldsmiths and urged them to complete the divine work with total devotion.

 

Later he inspected the vacant rooms in the TTD’s Old Huzur Office Complex and directed officials to repair and use them as storerooms for the goldsmiths to keep copper plates, bronze etc.

 

He also directed them to remove scrap materials. He also inspected the Panchaloha materials wing where he directed engineering officials to make it spacious with proper ventilation.

 

EE Sri Venugopal and AEO Sri Subbaraju and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామి ఆలయ విమానగోపురం బంగారు తాపడం పనుల వేగం పెంచాలి- అధికారులకు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం ఆదేశం

తిరుపతి 14 డిసెంబరు 2022: శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన ఎఫ్ఎ సిఎ ఓ శ్రీ బాలాజి , సిఈ శ్రీ నాగేశ్వరావు తో కలిసి జ్యువెలరీ విభాగాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా బంగారు తాపడానికి సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించారు. 50 మంది స్వర్ణకారులు బంగారు తాపడం పనులు చేస్తున్నట్లు అధికారులు జేఈవో కు వివరించారు. స్వర్ణకారులకు అవసరమైన వర్క్ షాప్ లను మరిన్ని ఏర్పాటు చేయాలని జేఈవో ఈ సందర్భంగా సిఈ ని ఆదేశించారు. ఇక్కడ ఉన్న కార్యాలయ గదిని మరోచోటికి మార్చి ఆ స్థలంలో కూడా వర్క్ షాప్ ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం ఐదు వర్క్ షాప్ లు ఏర్పాటు చేయడం ద్వారా పనుల వేగం పెంచవచ్చునని జేఈవో చెప్పారు. వివిధ దశల్లో జరుగుతున్న బంగారు తాపడం పనులను ఆయన పరిశీలించి, ఈ పనుల్లో నిమగ్నమైన వారితో మాట్లాడారు. బంగారు తాపడం పనులను భక్తిశ్రద్ధలతో చేయాలని జేఈవో వారికి సూచించారు. అనంతరం పాత హుజూర్ ఆఫీస్ లో ఖాళీగా ఉన్న గదులను పరిశీలించారు. వీటికి అవసరమైన మరమత్తులు చేసి ఉపయోగంలోకి తేవాలని ఈ సందర్భంగా జేఈవో సీఈని ఆదేశించారు. గదుల్లో అవసరంలేని మెటీరియల్ ను తొలగించి ఇక్కడ తయారైన పరికరాలను క్రమ పద్ధతిలో ఉంచుకోవడానికి స్టోర్ రూము త్వరగా ఏర్పాటు చేయాల న్నారు. రాగి ,ఇత్తడి సామగ్రి పరికరాలు ఉంచే గదిని జేఈవో పరిశీలించారు. ఇక్కడ ఉన్న అనవసరమైన వస్తువులను , ఆరు బయట ఉన్న వాటర్ వర్క్స్, విద్యుత్ విభాగాలకు సంబంధించిన ఉపయోగం లేని వస్తువులను వెంటనే బయటకు పంపాలని చెప్పారు. అనంతరం జేఈవో శ్రీ వీరబ్రహ్మం పంచలోహ విగ్రహాల తయారీ విభాగాన్ని పరిశీలించారు. ఈ విభాగం గది మరింత విశాలంగా ఉండి గాలి వెలుతురు బాగా వచ్చేలా మార్పులు చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ ఈ శ్రీ వేణుగోపాల్, ఏఈఓ శ్రీ సుబ్బరాజు ఇతర అధికారులు జేఈ ఓ వెంట ఉన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.