F TYPE QUARTERS TO BE RENOVATED SOON FOR PILGRIMS-TIRUMALA JEO_ ఎఫ్ టైప్ క్వార్టర్స్‌లో త్వరలో భక్తులకు అందుబాటులోకి 70 కాటేజీలు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు
Tirumala, 15 April 2018: The F-type quarters will soon be renovated to accommodate pilgrims in Tirumala, said JEO Sri KS Sreenivasa Raju.
The JEO along with CE Sri Chandrasekhar Reddy and other engineering officials inspected F-type quarters, Kakulakonda Road, the ongoing Third phase outer ring road works in Tirumala on Sunday evening.
Later speaking to media he said, to facilitate accommodation to Pilgrims, the 70 cottages in F-type quarters will be repaired soon. He said, TTD EO Sri Anil Kumar Singhal has approved towards the green scape development at New Seva Sadan at a cost of Rs.43lakhs.
SE 2 Sri Ramachandra Reddy, SE Electrical Sri Venkateswarulu, DFO Sri Phani Kumar and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎఫ్ టైప్ క్వార్టర్స్‌లో త్వరలో భక్తులకు అందుబాటులోకి 70 కాటేజీలు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు
ఏప్రిల్ 15, తిరుమల 2018: తిరుమలలోని ఎఫ్ టైప్ క్వార్టర్స్‌లో త్వరలో 70 కాటేజీలను అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని ఎఫ్ టైప్ క్వార్టర్స్, కాకులకొండ మార్గం, మూడో దశ ఔటర్ రింగ్ రోడ్డు పనులను ఆదివారం సాయంత్రం జెఈవో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఎఫ్ టైప్ క్వార్టర్స్‌లో ఎసి సదుపాయంతో కూడిన కాటేజీలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు కాకులకొండ వరకు రోడ్డును ఏర్పాటుచేస్తామని చెప్పారు. మూడో దశ రింగ్‌రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వీటితోపాటు ధర్మగిరి-శిలాతోరణం జంక్షన్ పనులు, ధర్మగిరి వేద పాఠశాల మార్గం అభివృద్ధి పనులు చేపడతామని వివరించారు. నూతన శ్రీవారి సేవాసదన్‌లో 43 లక్షలతో ఉద్యానవనాలు, పచ్చదనం పెంచేందుకు టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్ అనుమతులు మంజూరు చేశారని తెలిపారు.
జెఈవో వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, డిఎఫ్‌ఓ శ్రీ ఫణికుమార్ ఇతర అధికారులు ఉన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.