FACE RECOGNITION APP FOR RADHASAPTHAMI-CVSO_ రథసప్తమినాడు ఫేస్‌ రికగ్నిషన్‌ కెమెరాలతో నిఘా 600 మంది సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు :టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

600 TTD VIGILANCE AND SECURITY SLEUTHS TO VIGIL

Tirumala, 19 January 2018: The vigilance and security wing of TTD is geared up to make fool proof security arrangements to pilgrims during the ensuing Radhasapthami which is scheduled to take place on January 24 in Tirumala, said Chief Vigilance and Security Officer of TTD Sri A Ravikrishna.

Speaking to media persons during the press conference held at Command Control Room in Tirumala on Friday noon, the CVSO said, 600 vigilance and security personnel have been deployed to exclusively monitor the Surya Jayanthi arrangements.

The top cop of TTD said, Face Tagger, a tech company which makes security app has come forward to train 200 vigilance and security sleuths in Face Recognition App in tracing the unscrupulous elements involved in black marketing of laddus, darshan tickets, accommodation, thefts, crimes etc. with the help of this app. We can also track their past crime record. Initially they will train our men free of cost on trial basis for three months. Later on we will plan the long term programme based on the results. Apart from this, the CCTV phase 1 installation works will be completed by February first week”, the CVSO said.

He also said, keeping the previous experiences, this time, there will separate vigil in all the galleries to man as well to check the problems being encountered by the pilgrim crowd during Vahana Sevas in Radhasapthami. We will be allowing the pilgrims to enter into the galleries through 11 gates. Our aim is to ensure safety and convenient darshan to pilgrims during the mega religious fete”, he asserted.

VGOs Sri Ravindra Reddy, Smt Sada Lakshmi, all sectors AVSOs, VIs were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

రథసప్తమినాడు ఫేస్‌ రికగ్నిషన్‌ కెమెరాలతో నిఘా 600 మంది సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు :టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

తిరుమల, 2018 జనవరి 19: తిరుమలలో జనవరి 24న రథసప్తమినాడు ఫేస్‌ రికగ్నిషన్‌ కెమెరాలతో నిఘా ఉంచుతామని, మొత్తం 600 మంది నిఘా, భద్రతా సిబ్బందితో భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ తెలిపారు. తిరుమలలోని పిఏసి-4లో గల కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో శుక్రవారం సివిఎస్‌వో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ రథసప్తమినాడు ఏడు వాహనాలపై స్వామివారు మాడ వీధుల్లో విహరిస్తారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతృప్తికరంగా వాహనసేవలను భక్తులు దర్శించుకునేలా భద్రతా ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. ఫేస్‌ ట్యాగర్‌ అనే సంస్థ సహకారంతో 200 మంది భద్రతా సిబ్బందికి ఫేస్‌ రికగ్నిషన్‌ సెక్యూరిటీ యాప్‌పై శిక్షణ ఇప్పిస్తామన్నారు. దర్శనం, గదులు, లడ్డూ దళారులు, జేబుదొంగల ఫొటోలను ఈ యాప్‌లో పొందుపరిచామని తెలిపారు. ఇలాంటివారిని ఫొటో తీస్తే ఈ యాప్‌ ద్వారా వారి గతాన్ని తెలుసుకోవచ్చన్నారు. మాడ వీధుల్లోని 11 గేట్ల నుంచి భక్తులను గ్యాలరీల్లోకి అనుమతిస్తామన్నారు. ప్రతి గ్యాలరీలో భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తిరుమలలో మొదటి దశలో జరుగుతున్న సిసిటివిల ఏర్పాటు పనులు ఫిబ్రవరి మొదటివారంలో పూర్తవుతాయని సివిఎస్‌వో వివరించారు.

మీడియా సమావేశంలో విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, ఎవిఎస్‌వోలు, విఐలు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.