FACE RECOGNITION TECHNOLOGY FROM MARCH I _ మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు 

TIRUMALA, 28 FEBRUARY 2023: TTD set to introduce Facial Recognition Technology on an experimental basis at Vaikuntham 2 and in Accommodation Management System from March 1 onwards.

The idea is to enhance transparency in tokenless darshan and allotment of rooms providing more effective services to the multitude of visiting pilgrims.

This new tech system will be used to prevent a person from procuring more tokens in Sarva Darshan Complex and also at the Caution Deposit refund counters.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు

– గదులకేటాయింపు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద అమలు

తిరుమల, 28 ఫిబ్రవరి 2023: తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా బుధవారం నుంచి తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.

తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు కౌంటర్లు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద ఈ పరిజ్ఞానం ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి లడ్డూలు జారీ చేస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.