Feb 20-21 SPECIAL DARSHAN FOR CHALLENGED, AGED, PARENTS WITH INFANTS_ ఫిబ్రవరి 20వ తేదీ వ ద్ధులు, దివ్యాంగులకు, ఫిబ్రవరి 21వ తేదీ చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
Tirumala, 19 February 2018: To cater to darshan needs of aged, challenged and also parents with infants of below 5 years, the TTD has organized two days in a month to provide them comfortable Srivari darshan through time slots.
Daily the aged, challenged and parents with infants are provided srivari darshan at 10am in the morning and 3pm in the evening through Supatham entry gate a separate queue line.
The special tokens are issued to the above categories in advance online for two days in a month so that they could plan their visit and comfortably get darshan of Lord Venkateswara instead of visiting on crowded days and suffer inconveniences.
As part of the above objective, the TTD has issued 4000 tokens for darshan to aged people beyond 65 years and challenged persons for Tuesday (Feb.20) at the rate of 1000 at 11 clock slot, 2000 at 2pm clock and another 1000 for 3pm clock slot. They will all be given darshan through a separate special queue line.
On February 21 parents with below 5-year-old infants were provided entry from Morning 9.00 -afternoon 1.00 Through Supatham entry gate. On normal days parents with one-year-old are provided entry through same Supatham gate.
In view of the request of devotees on two days, a month parents with 5-year-old infants are provided Srivari Darshan through Supatham gate.
All devotees are requested to make use of this opportunity and beget the blessings of Lord Venkateswara.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 20వ తేదీ వ ద్ధులు, దివ్యాంగులకు, ఫిబ్రవరి 21వ తేదీ చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
ఫిబ్రవరి 19, తిరుమల, 2018: ఎక్కువ మంది వయో వ ద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం వయోవ ద్ధులు (65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 11 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వ ద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. భక్తుల కోరిక మేరకు మరింత మందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండు రోజులపాటు టిటిడి అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తోంది. వ ద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.