FEBRUARY QUOTA OF ₹300 SPECIAL ENTRY DARSHAN TICKETS ON NOV 24 _ నవంబరు 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
Tirumala,23 Nov 2023: TTD to release February 2024 quota of ₹300/- Special Entry Darshan tickets at 10 am on November 24.
Similarly, the online quota of rooms at both Tirumala and Tirupati will be released at 3 pm on the same day.
Devotees are requested to book their Darshan and accommodation online in advance on the TTD website https://ttdevasthanams.ap.gov.in only.
SRIVARI SEVA QUOTA RELEASE ON NOVEMBER 27
The Srivari Seva quota for Tirumala and Tirupati for the month of February-2024 Rathasapthami slots(18 years to 50 years only) will be released on 27.11.2023 at 10 AM while the Srivari Seva Quota for Tirumala and Tirupathi, Navaneeta Seva for the months of January-2024 and February-2024 will be released on the same day at 12 noon. And the online Quota of Parakamani Seva, Tirumala for the months of January 2024 and February 2024 will be released at 3 pm.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుమల, 2023 నవంబరు 23 ; భక్తుల సౌకర్యార్థం 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అదేవిధంగా తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను నవంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
నవంబరు 27న శ్రీవారి సేవ కోటా విడుదల
2024 ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినానికి సంబంధించిన శ్రీవారి సేవ స్లాట్లను నవంబరు 27న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 18 నుండి 50 ఏళ్ల వరకు వయోపరిమితి ఉన్నవారు మాత్రమే ఈ స్లాట్లను బుక్ చేసుకునేందుకు అర్హులు.
అదేవిధంగా, తిరుమల, తిరుపతిలో భక్తులకు స్వచ్ఛంద సేవ చేసేందుకు గాను 2024 జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ కోటాను నవంబరు 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
ఈ సేవలను www.tirumala.org వెబ్‌సైట్‌లో భక్తులు బుక్ చేసుకోవచ్చు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.