FESTIVITIES AT SRI KODANDARAMA SWAMY TEMPLE IN JUNE _ జూన్ లో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 30 May 2024: Many special festivals will be observed in  Sri Kodandarama Swamy temple in Tirupati in the month of June. 
 
June 1,8,15,22,29- Abhishekam will be performed at 6 am on Saturdays to the Moolavarulu 
 
June 6 – Sahasra Kalasabhishekam will be performed on the occasion of Amavasya at 8 am.  Hanuman Vahanaseva will be held at 7 pm.
 
June 9 – On the occasion of Punarvasu Nakshatra  Sita Rama Kalyanam will be held at 11am.   
 
June 22 -on the occasion of the full moon day, Ashtottara Shatakalasha Abhishekam will be performed at 8.30 am
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూన్ లో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2024 జూన్ 30: తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో జూన్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– జూన్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.

– జూన్ 6న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

– జూన్ 9న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– జూన్ 22న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.