FINANCIAL LITERACY AWARENESS SESSION BY RBI OFFICIALS TO TTD EMPLOYEES _ టీటీడీ ఉద్యోగులకు ఆర్బిఐ అధికారులచే ఆర్థిక అవగాహన సదస్సు 

GOOD FINANCIAL BEHAVIOUR-YOUR SAVIOUR

 

TIRUPATI, 15 FEBRUARY 2023: As part of its annual programme of Financial Literacy Week, the RBI officials organised a half-day awareness session to TTD employees in SVETA Bhavan on Wednesday.

 

Smt Poornima, Lead District Officer of RBI from Hyderabad said, every year, RBI observes Financial Literacy programme to educate and bring awareness among the denizens about the various Government Schemes, Banking guidelines, cyber safety methods in on-line banking system etc. “This year’s theme is Good Financial Behaviour

– Your Saviour.  Financial Discipline will definitely help all of us from the economic crisis”, she asserted.

 

Tirupati Head of RBI Sri Subhash cautioned the employees about the various financial and cyber crimes taking place and enlightened every one not to enclose their passwords or fall prey to online games, loans by unauthorized loan apps etc.giving some examples where in many people lost huge amounts pledging even their agriculture land and investments.

 

Sri LM Naidu, another official from RBI explained in detail about the benefits of Central Government Schemes including Sukanya Samriddhi Yojana meant for girls (upto 21years), Pradhan Mantri Jeevan Jyothi Bima Yojna(PMJJBY) for 18-50years citizens,  Pradhan Mantri Vaya Vandana Yojana (PMVVY) for senior citizens in detail.

During the interaction session, the employees actively participated and cleared their doubts. The RBI officials also distributed a T-Shirt and a Hat that carried the guidelines to every participant.

 

SVETA Director Smt Prasanthi was also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ఉద్యోగులకు ఆర్బిఐ అధికారులచే ఆర్థిక అవగాహన సదస్సు

తిరుపతి, 2023 ఫిబ్రవరి 15: ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు బుధవారం శ్వేతా భవన్‌లో టీటీడీ ఉద్యోగులకు ఆర్థిక అవగాహన సదస్సును నిర్వహించారు.

హైదరాబాద్‌కు చెందిన ఆర్‌బిఐ లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్రీమతి పూర్ణిమ మాట్లాడుతూ, వివిధ ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ మార్గదర్శకాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోని సైబర్ సేఫ్టీ పద్ధతులు మొదలైన వాటిపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆర్‌బిఐ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.
ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక సంక్షోభం సమయంలోసహాయం చేస్తుందని ఆమె చెప్పారు.

తిరుపతి ఆర్బిఐ హెడ్ శ్రీ సుభాష్ వివిధ ఆర్థిక, సైబర్ నేరాల గురించి హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లోను ఎవరికీ చెప్పకూడదన్నారు. ఆన్‌లైన్ గేమ్‌ల బారిన పడవద్దని, అనధికార లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి తెలియజేశారు.

ఆర్.బి.ఐ అధికారి శ్రీ ఎల్ ఎం నాయుడు, బాలికల కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన (21 సంవత్సరాల వరకు), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 18-50 సంవత్సరాల పౌరులకు లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల గురించి వివరించారు.

ఉద్యోగులు తమ సందేహాలను అధికారుల ద్వారా నివృత్తి చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్వేతా డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.