FIRST CITIZEN OF INDIA OFFERS PRAYERS ON HER MAIDEN VISIT TO TIRUMALA TEMPLE _ శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి గౌ|| శ్రీమతి ద్రౌపతి ముర్ము

TIRUMALA, 05 DECEMBER 2022: The Honourable President of India, Smt Droupadi Murmu, during her maiden visit to Tirumala, offered prayers in the Hill Shrine of Sri Venkateswara Swamy on Monday along with her entourage.

‌ Following the temple tradition, the President initially offered prayers in Swamy Pushkarini and later had darshan of Sri Varahaswami Swamy temple.

Thereafter when the President reached Mahadwaram of Srivari temple, she was received by the TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri AV Dharma Reddy.

The temple Archakas welcomed the first citizen of India with the traditional Istikaphal honours amidst chanting of Veda Mantras in the accompaniment of Melam.

The President and her entourage went for Srivari Darshan and offered prayers to the presiding deity of Lord Venkateswara inside the sanctum sanctorum. The chief priest explained about the significance of the Mula Virat, the jewels adorned to the chief deity and Kshetra Mahatyam.

Later the President was offered Veda Ashirvachanam at Ranganayakula Mandapam.

The TTD Chairman and EO together presented Srivari Theertha Prasadams and Dry Flower Technology photo of Lord Venkateswara along with 2023 TTD Diaries and Calendars to the President.

Union Minister Sri Kishen Reddy, DyCMs of AP Sri Narayana Swamy, Sri Satyanarayana, AP Minister Smt Roja were present.

Both  the Senior and Junior Pontiffs of Tirumala, and one of the chief priests of temple Sri Venugopala Deekshitulu were also present.

Among others Principal Secretary Sri AK Singhal, Additional DGP Sri Ravishankar Iyer, DIG Ravi Prakash, Tirupati Collector Sri Venkatramana Reddy, SP Tirupati Sri Parameshwar Reddy, SP Chittoor Sri Rishant Reddy, CVSO of TTD Sri Narasimha Kishore were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి గౌ|| శ్రీమతి ద్రౌపతి ముర్ము

తిరుమల, 2022 డిసెంబర్ 05: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం ఉదయం భారత రాష్ట్రపతి గౌ|| శ్రీమతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు.

గౌ|| రాష్ట్రపతి సోమవారం ఉదయం 9.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం
శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు.

అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న గౌ|| రాష్ట్రపతికి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం గౌ|| రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌ స్వామి ఉన్నారు.
ఈ సందర్భంగా శ్రీవారి ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని , సన్నిధిలోని ఇతర ఆలయాల గురించి వివరించారు.

అనంతరం రంగనాయకుల మండపంలో గౌ||రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. ఛైర్మ‌న్‌, ఈవో కలిసి శ్రీవారి శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను, గౌ|| రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ముకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు శ్రీ నారాయణ స్వామి, శ్రీ సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి శ్రీమతి రోజా, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ , జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డి , అదనపు డిజి శ్రీ రవిశంకర్ అయ్యర్ , డిఐజి శ్రీ రవిప్రకాష్ , సివి ఎస్వో శ్రీ నరసింహ కిషోర్ , తిరుపతి ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ శ్రీ రిశాంత్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.