FIVE BATTERY VEHICLES DONATED _ శ్రీవారికి ఐదు బ్యాట‌రీ ఆటోలు విరాళం

Tirumala, 1 November 2020: Devotee from Vellore based VSL industries and Akella Raghavendra Foundation have donated five battery run autos worth Rs15 lakhs to Srivari temple on Sunday.

The auto keys were handed over by devotee Sri GA Hari Krishna, MD of VSL industries and Sri Akella Raghavendra to Srivari temple in charge DyEO Sri Venkateayya,

TTD transport DE Sri Mohan was also present.

Of the five autos three were deployed for coverage sanitation and two were allotted for garbage clearance.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారికి ఐదు బ్యాట‌రీ ఆటోలు విరాళం

తిరుమల, 2020 నవంబర్ 01: తిరుమల శ్రీవారికి ఆదివారం ఐదు బ్యాట‌రీ ఆటోలు విరాళంగా అందింది. వేలూరుకు చెందిన ప్రముఖ బ్యాటరీ ఆటోల తయారీ సంస్థ వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్ మరియు ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ లు కలిసి ఈ మేరకు దాదాపు రూ.15 ల‌క్ష‌ల‌ విలువైన ఐదు బ్యాటరీ ఆటోలను అందజేశారు.

శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాతలు వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్ ఎం.డి. శ్రీ జి.ఏ. హరికృష్ణ, శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర ఈ మేరకు ఆటో తాళాలను శ్రీవారి ఆలయ ఇంచార్జ్ డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల రవాణా విభాగం డి.ఐ.శ్రీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఇందులో మూడు ఆటోలను కోవిడ్ -19 శానిటేషన్ కోసము, రెండు ఆటోలు తిరుమలలో వ్యర్ధాలను తరలించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.