FLOAT FEST BEGINS _ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవాలు ప్రారంభం

Tirupati, 22 December 2023: The five-day annual float festival commences in Sri Kapileswara Swamy temple in Tirupati on Friday.

On the first day evening, Sri Ganapati took a celestial ride on the finely decked float.

Dy EO Sri Devendra Babu and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవాలు ప్రారంభం
 
తిరుపతి, 2023, డిసెంబరు 22: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామి వారు కపిలతీర్థం పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
 
అదేవిధంగా రెండవ రోజు శ్రీ సుబ్రమణ్యస్వామివారు ఐదు చుట్లు,మూడోరోజు శ్రీ సోమస్కందస్వామివారు ఐదు చుట్లు, నాలుగో రోజు శ్రీ కామాక్షి అమ్మవారు ఏడు చుట్లు, ఐదోరోజు శ్రీ చండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.