FLOAT FESTIVAL CONCLUDES IN KRT_ వైభవంగా ముగిసిన శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు

Tirupati, 31 March 2018: The three day float festival concluded on a grand religious note in temple city of Tirupati on Saturday evening.

Lord Sri Rama took celestial ride on the finely decked float in Sri Ramachandra Pushkarini between 7pm and 8:30pm.

Under the bright light of full moon, Lord Sri Rama along with Goddess Sita and Lakshmana Swamy blessed the devotees by taking nine rounds on the Teppa.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా ముగిసిన శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు

తిరుపతి, 2018 మార్చి 31: తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణిలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ కోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.

అనంతరం సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు ఆలయం నుండి బయల్దేరి రాత్రి 7 గంటలకు శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు చేరుకోనుంది. విద్యుద్దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. తెప్పోత్సవం అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తిరిగి ఆలయానికి తీసుకెళతారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.