FLUTE CONCERT STEALS THE SOULS _ కపిలతీర్థంలో ఆకట్టుకున్న వేణుగానం

TIRUPATI, 02 MARCH 2024: The mellifluous flute concert by Sri Chennai and his team from SV college of Music and Dance charmed the devotees at Kapilatheertham on Saturday evening.

As a part of the cultural feast during the ongoing annual Brahmotsavams, the Venuganam enhanced the devotional waves.

Similarly Sri Sudhakar and his team, Dr Usharani Kuchipudi dance also stood as the show stoppers on the pleasant evening.

Additional FACAO Sri Raviprasadu, Chief Audit Officer Sri Sesha Sailendra, College Principal Dr Uma Muddubala and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

కపిలతీర్థంలో ఆకట్టుకున్న వేణుగానం

తిరుప‌తి, 2024, మార్చి 02: శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాశాల వేణువు విభాగం అధ్యాపకులు శ్రీ ఎ.చెన్నయ్య బృందం వేణుగానం భక్తులను ఆనందపరవశంలో ముంచెత్తింది. శ్రీ విఘ్నరాజం భజే…, బ్రహ్మమురారి సురార్చిత లింగం…. తదితర కీర్తనలతో ఆద్యంతం అలరించారు. వయోలిన్ పై కళాశాల అధ్యాపకులు శ్రీ యం.సురేంద్ర, మృదంగంపై శ్రీ రఘురాం సహకారం అందించారు.

అంతకుముందు గాత్ర అధ్యాపకులు శ్రీ కె.సుధాకర్ బృందం ఆలపించిన మహా గణపతిం.., శంభో శివ శంభో…నాదా తనుమనిశం..కామాక్షి లోక సాక్షిణి మొదలైన కీర్తనలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. వయోలిన్ పై జి.చెన్నయ్య, మృదంగంపై శ్రీ కె.రమేష్, శ్రీ రఘురాం వాద్య సహకారం అందించారు.

ఆ తర్వాత కళాశాల అధ్యాపకురాలు డా.ఉషారాణి బృందం కూచిపూడి నృత్యాన్ని చక్కగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సంజన, అన్షుశ్రీ, జ్ఞాన ప్రసూన సాయిశ్రీ, శ్రేష్ట, సాయి హర్షిణి, జ్యోత్స్న, వినయశ్రీ నృత్య ప్రదర్శన చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఎఫ్ఏసీఏఓ శ్రీ రవిప్రసాదు, సీఏఓ మరియు కళాశాల ప్రత్యేకాధికారి శ్రీ శేషశైలేంద్ర, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.