FOCUS ON ORGANIC VEGGIES-EO _ఆర్గానిక్ కూరగాయలు అందించండి- దాత‌ల‌తో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స‌మావేశం

MEETING HELD WITH VEG DONORS

TIRUMALA, 28 AUGUST 2023: As the twin brahmotsavams are scheduled in September and October, TTD EO Sri AV Dharma Reddy asked the vegetable donors from Southern States to supply varieties of vegetables focussing on organic veggies also.

The meeting was held at Annamayya Bhavan in Tirumala on Monday evening. About 22 vegetable donors from Andhra Pradesh, Telangana, Tamil Nadu Karnataka etc. have participated.

“During the last Brahmotsavams a total of 1.14lakh kilos of 25 varieties of vegetables were supplied. This year, we are planning a special menu ever day during Brahmotsavams for devotees and therefore increase the supply with more varieties of vegetables. Do concentrate on organic veggies as they are not only tastier but healthier also”, EO urged the donors.

Later he felicitated the vegetable donors with a shawl and presented Srivari Prasadams to them.

Deputy EO Annaprasadam Sri Rajendra Kumar, Catering Special Officer Sri Shastry and other staffs, donors were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆర్గానిక్ కూరగాయలు అందించండి

– దాత‌ల‌తో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స‌మావేశం

తిరుమల, 2023, ఆగస్టు 28: తిరుమ‌ల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు వడ్డించేందుకు అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి గాను క్రమంగా ఆర్గానిక్ కూరగాయల సరఫరాను పెంచాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దాతలను కోరారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం సాయంత్రం కూరగాయల దాతలతో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి సాలకట్ల బ్ర‌హ్మోత్స‌వాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉండ‌డంతో భ‌క్తుల‌కు రుచిక‌ర‌మైన అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు అన్ని ర‌కాల కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు. దాత‌లు ఎంతో స‌హ‌కారం అందిస్తున్నార‌ని, 2004వ సంవ‌త్స‌రం నుండి నిరంత‌రాయంగా కూర‌గాయల స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. తాజా కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేస్తుండ‌డంతో అన్న‌ప్ర‌సాదాలు రుచిక‌రంగా, నాణ్యంగా ఉంటున్నాయ‌న్నారు. ఆర్గానిక్ కూరగాయలతో వంట రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యకరమని తెలిపారు. గతేడాది బ్రహ్మోత్సవాలకు 1.14 లక్షల కిలోల కూర‌గాయ‌లు విరాళంగా అందాయ‌ని, ఈ ఏడాది మరింత పెంచాలని కోరారు. అనంతరం దాతలకు శ్రీవారి ప్రసాదం అందించి శాలువాతో సన్మానించారు.

ఈ స‌మావేశంలో అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, క్యాట‌రింగ్ ప్రత్యేకాధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి, ఏఈవోలు శ్రీ గంగాధర్, శ్రీ శ్రీనివాసులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుంచి వ‌చ్చిన 22 మంది కూర‌గాయ‌ల దాత‌లు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.