FOREST WORKERS ABSENT FOR MEETING _ అటవీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చర్చలకు హాజరు కాని నాయకులు

Tirupati, 26 August 2021: The leaders of the TTD Forest Workers Association had for the second time failed to turn up for negotiations on their demands.

The Society leaders who had given notice to TTD Management of agitation from Wednesday had failed to attend the meetings called by the TTD JEO Smt Sada Bhargavi on both Tuesday and Thursday as well.

The TTD JEO had made all arrangements for negotiations at the Conference Hall on Thursday evening in TTD Administrative Building. But the TTD forest workers society leaders had not come for the meeting.

They did not turn up both the times though the Management has invited them for negotiations.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అటవీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చర్చలకు హాజరు కాని నాయకులు

తిరుపతి 26 ఆగస్టు 2021: టీటీడీ అటవీ కార్మికుల సమస్యలపై చర్చల కోసం టీటీడీ యాజమాన్యం గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశానికి సొసైటీల నాయకులు హాజరు కాలేదు.

సమస్యల పరిష్కారం కోసం బుధవారం సొసైటీల నాయకులు ఆందోళనకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం సాయంత్రం 5-30 గంటలకు చర్చలకు రావాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి సొసైటీల నాయకులను ఆహ్వానించి సాయంత్రం 6 -30 గంటల వరకు వేచి చూశారు. తక్కువ వ్యవధిలో చర్చలకు ఆహ్వానించినందువల్ల తాము రాలేక పోయామని వారు సమాచారం పంపారు. దీంతో జెఈవో శ్రీమతి సదా భార్గవి గురువారం సాయంత్రం 5.30 గంటలకు సమావేశానికి రావాలని వారికి సమాచారం పంపారు. ఈ మేరకు టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో ఏర్పాట్లు చేయించారు. అయితే సాయంత్రం 6-30 గంటల వరకు సొసైటీల నాయకులు సమావేశానికి హాజరు కాలేదు. సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపేందుకు టీటీడీ యాజమాన్యం రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసినా సొసైటీ నాయకులు హాజరు కాలేదు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.