FORMER CJI TO TAKE PART IN PLASTIC-FREE TIRUMALA MASS CLEANING PROGRAM ON MAY 13 _ తిరుమలలో అత్యాధునిక భద్రత వ్యవస్థ ఏర్పాటు

ANANDA NILAYAM VIDEO MISCREANT CAUGHT

MORE MECHANISED AND QUICK FRISKING MODEL SUGGESTED 

CENTRAL AND STATE IB TEAMS TO VISIT TIRUMALA NEXT WEEK -TTD EO

TIRUMALA, 12 MAY 2023: The massive mass cleaning of Ghat Roads and Footpath routes program taken up by TTD on May 13 will be attended by former Chief Justice of India, Justice NV Ramana, said TTD EO Sri AV Dharma Reddy.

Speaking to media persons after the Dial your EO program at Annamaiah Bhavan in Tirumala on Friday, the EO said, in Sundara Tirumala-Suddha Tirumala program, so far about 6000 employees and nearly 3000 srivari sevaks have voluntarily participated in the last 12 days and successfully carried out the cleaning mission. “On Saturday, in the mass plastic-free Tirumala program, along with the TTD employees, district and police, corporation departments are also taking part expressing their solidarity to the TTD program. “District Collector, SP, Joint Collector, Swachandhra Pradesh Corporation Advisor, Commissioner, Judges and many more are also taking part in the program voluntarily”, he added.

“We have divided the up and down ghats and both the footpath routes into various sectors and deployed in-charge officials for each sector. In up ghat nearly 15 supporting staff for every sector and down ghat 30 will be there in the mass cleaning”, he maintained.

On Ananda Nilayam video leak on social media, the EO said, a devotee from Khammam by name Rahul Reddy was caught hold by TTD vigilance through the CCTV footage and he will be interrogated by Tirupati police. “Action will be initiated against the onduty security staff at the scanning areas for the lapse checking on that day. The CVSO is also instructed to study a more mechanised and quick way of checking akin to the Airport Model so that we can provide darshan to not less than 5000-5500 devotees in an hour after thorough checking in the scan area. For that we have also consulted Central and State IB teams who will be visiting Tirumala by next week”, he maintained.

Both the JEOs Sri Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

తిరుమలలో అత్యాధునిక భద్రత వ్యవస్థ ఏర్పాటు

– ఆనంద నిలయం వీడియో తీసిన వక్తిని గుర్తించిన టీటీడీ విజిలెన్స్ విభాగం

– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2023 మే 12: తిరుమలలో అత్యాధునిక భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు.

డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల ఖమ్మంకు చెందిన భక్తుడు శ్రీవారి ఆలయంలోకి మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లి ఆనంద నిలయమును వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందన్నారు. ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ ఆలయంలోకి తీసుకువెళ్లడం భద్రత సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఇందుకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ చూసి భక్తుడు భద్రత సిబ్బందిని మోసం చేసి ఆలయంలోనికి మొబైల్ ఫోన్ తీసుకు వెళ్లినట్లు నిర్ధారించారన్నారు. అతనిని గుర్తించి తిరుపతికి తీసుకోస్తున్నాట్లు చెప్పారు.

శ్రీవారి ఆలయంలో గంటకు 5,500 మందిని దర్శనానికి పంపించాలి. గురువారం క్షుణంగా తనిఖీ చేయడం వల్ల గంటకు 2,500 మందిని మాత్రమే దర్శనానికి పంపినట్లు చెప్పారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం, కేంద్ర భద్రతాధికారులు తిరుమలకు వచ్చి నూతన భద్రత వ్యవస్థను రూపొంధించనున్నట్లు తెలిపారు. తిరుమలలో సిసి టీవీ వ్యవస్థ చాలా బాగుందని, వెనక్కి వెళ్లి ఆ అజ్ఞాత భక్తుని గుర్తించడం జరిగిందన్నారు. త్వరలో ఆధునిక భద్రత పరికరాలు, స్కానింగ్ మిషన్లు, అదనపు భద్రతా సిబ్బందిని నియమించనున్నట్లు ఈవో వివరించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.