FORMER VICE PRESIDENT DINES AT MTVAC _ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి
Tirumala, 27 July 2025: Former Vice-President of India Sri M Venkaiah Naidu accompanied by the TTD Chairman Sri BR Naidu
dined at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC)in Tirumala on Sunday along with the devotees.
On this occasion, he interacted with the devotees who expressed their immense pleasure over the tasty Annaprasadam. He also lauded the services of Srivari Sevaks.
Later speaking to the media persons he described the Annaprasadam served by TTD is hygienic and delicious. He also said it is a welcoming gesture that many devotees are voluntarily coming forward to render seva to their fellow devotees with dedication as Srivari Sevaks.
The TTD Trust Board member Sri Bhanu Prakash Reddy, Additional EO Sri Ch Venkaiah Chowdary, other officers were also present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించిన భారత మాజీ ఉప రాష్ట్రపతి
తిరుమల, 2025 జూలై 27: భారత మాజీ ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడు తో కలిసి ఆదివారం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన భక్తులతో ముచ్చటించారు. అన్నప్రసాదాలు రుచికరంగా, శుభ్రంగా ఉన్నాయని భక్తులు ఆయన వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలను కూడా ప్రశంసించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదం ఎంతో శుచిగా, రుచిగా ఉందని తెలిపారు. శ్రీవారి సేవకులుగా భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సహక్తులకు సేవలందించడం ఆనందదాయకమైన విషయమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాశ్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.








