FORTY CRORES FOR SRIVANI TRUST IN 100 DAYS _ శ్రీవాణి ట్రస్టుకు 100 రోజుల్లో రూ.40 కోట్ల విరాళాలు
DEVOTEES OF LORD VENKATESWARA GIVES THUMBS UP TO SRIVANI GLOBALLY
DONATIONS TO BE UTILISED FOR SANATANA DHARMA PRACHARA
Tirumala, 29 Jan. 20: Sri Venkateswara Alaya Nirmana (SRIVANI)Trust mulled by TTD towards promotion, propagation and protection of sanatana Hindu Dharma Prachara has won the hearts of global devotees of Srivaru who have contributed about Rs.40crore in 100 days.
The devotees of Sri Venkateswara Swamy who are spread across the world are contributing largesse for SRIVANI Trust. In order to honour the contribution of the donor towards the cause of Hindu Dharma Parirakshana, a onetime privilege of VIP break darsan was approved by the TTD Board for donors contributing a minimum Rs.10 thousands to this trust which has gained momentum since the inception of this privilege from 21 October during last year.
So far in the Online 33980 members have booked for darshan taking the donation amount to Rs 26.18crore. So far 18216 members have availed darshan facility among online donors. While in Offline till January 29, 13380 members have contributed and had darshan of Lord taking the total amount to Rs 13.38cr.
So far major contributions are from Andhra Pradesh touching the total to 10 crore mark followed by Tamilnadu, Telangana, Karnataka, New Delhi and Maharashtra.
Even there is an immense response from NRI devotees with major contributions from US, Malaysia, Singapore and UAE also.
The funds to this Trust will be utilized to renovate temples under dilapidated conditions and also to construct Srivari temples in weaker section areas which are more liable to religious conversions.
The devotees are also hailing the noble move promotion of Sanatana Dharma of TTD Board and mandarins through this Trust and also providing the devotees an opportunity to be a part in the cause of Hindu Parirakshana by donating through this Trust.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవాణి ట్రస్టుకు 100 రోజుల్లో రూ.40 కోట్ల విరాళాలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుండి విశేష స్పందన
శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఈ విరాళాలు వినియోగం
తిరుమల, 2020 జనవరి 29: ధర్మప్రచారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి, పురాతన ఆలయాల పరిరక్షణకు ఉద్దేశించిన శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ(శ్రీవాణి) ట్రస్టును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి భక్తులు స్పందించారు. 100 రోజుల వ్యవధిలో సుమారు రూ.40 కోట్ల విరాళాలందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుండి శ్రీవారి భక్తులు తమ శక్తి మేర ఈ ట్రస్టుకు విరాళాలందించారు. హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న ఇలాంటి భక్తులకు ఒకసారి విఐపి బ్రేక్ దర్శనం కల్పించాలని టిటిడి బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు కనీసం రూ.10 వేలు విరాళమిచ్చే దాతలకు ఒక విఐపి బ్రేక్ దర్శన టికెట్ ప్రివిలేజ్‌గా ఒకసారి మాత్రమే అందించాలని, దాతలు రూ.500/- చెల్లించి బ్రేక్ దర్శన టికెట్ కొనుగోలు చేయాలని మార్గదర్శకాలు రూపొందించింది. గతేడాది అక్టోబరు 21 నుండి ఈ నిర్ణయాన్ని అమలుచేసింది. అప్పటినుండి మరింతమంది దాతలు ముందుకొచ్చి విరాళాలు సమర్పించారు.
ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 33,980 మంది దాతలు రూ.26.18 కోట్ల విరాళాలందించి బ్రేక్ దర్శన టికెట్లను బుక్ చేసుకున్నారు. ఆన్‌లైన్ విధానంలో ఇప్పటివరకు 18,216 మంది దాతలు శ్రీవారిని దర్శించుకున్నారు. జనవరి 29వ తేదీ వరకు 13,380 మంది దాతలు రూ.13.38 కోట్ల విరాళాలను నేరుగా అందించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుండి రూ.10 కోట్ల విరాళాలు అందగా, ఆ తరువాత స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, న్యూఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రాలున్నాయి. అమెరికా, మలేసియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లోని ప్రవాస భారతీయులు కూడా విశేషంగా స్పందించి విరాళాలు సమర్పించారు.
శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణానికి, వెనకబడిన ప్రాంతాల్లో మత మార్పిడులను అరికట్టి హైందవ ధర్మ విశిష్టతను తెలిపేలా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఈ ట్రస్టుకు అందిన విరాళాలను టిటిడి వినియోగిస్తుంది. టిటిడి తలపెట్టిన ఈ బృహత్కార్యంలో భాగస్వాములను చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.