FOUNDATION STONE LAID FOR SRI RAMALAYAM WORKS BY EO _ రామాలయానికి శంఖుస్థాపన

YSR KADAPA, 04 JULY 2021: TTD EO Dr KS Jawahar Reddy along with District Collector Sri Harikiran laid the foundation stone for Sri Ramalayam works at Chavvaripalli.

Speaking on the occasion TTD EO said, the Jeernodharana fete of Sri Bhanukota Someswaralayam ancient Siva temple was held and the development works at will be taken up in this temple with funds from SRIVANI Trust. “We are contemplating to complete the works in a year”, he said.

Adding further he said, the locals have also sought for the construction of a Sri Rama temple in Chavvaripalli and towards the construction of the temple Rs.23.50lakhs have been allotted following the representation from the public representatives, Sarpanch and locals, he said.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

రామాలయానికి శంఖుస్థాపన

తిరుపతి 2021 జూలై 04: చవ్వా వారి పల్లిలో రూ.23.5 లక్షలతో రామాలయం నిర్మాణానికి టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, కలెక్టర్ శ్రీ హరి కిరణ్ శంఖుస్థాపన చేశారు.

అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

భానుకోట శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు ఏడాదిలో పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేశామని చెప్పారు. భానుకోట సోమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైందన్నారు. ఇక్కడి ప్రజలు, ఎంపి విజ్ఞప్తి మేరకు శ్రీవాణి నిధులతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపడుతున్నామన్నారు. ఈ పనులన్నీ రాతి కట్టడంతో చేస్తామని ఆయన తెలిపారు. చవ్వా వారి పల్లి ప్రజలు, సర్పంచ్ కోరిక మేరకు అ గ్రామంలో కూడా రూ 23. 50 లక్షలతో రామాలయం నిర్మించనున్నామని ఆయన వివరించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.