FOUNDATION STONE LAID FOR TTD KALYANA MANDAPAM IN BUGGA _ బుగ్గ లో టీటీడీ కల్యాణ మండపానికి శంఖుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్, మంత్రి

Tirupati, 14 February 2024: The foundation stone for TTD Kalyana Mandapam has been laid in Bugga by TTD Chairman Sri. Bhumana Karunakara along with the AP Minister Smt RK Roja.

Speaking on the occasion, Smt Roja thanked the TTD Chairman for granting Kalyana Mandapam upon her request for the benefit of the locals as soon as he took over the reins of TTD Board.

Speaking on the occasion TTD board chief said they are building a Kalyana Mandapam in Bugga with a noble intention that if the poor gets married in the presence of the deity at a nominal cost, it will be auspicious for them.

On Wednesday, the foundation stone was laid for the TTD Kalyana Mandapam to be constructed at a cost of Rs 2 crore near  Annapurneshwari Sametha Sri Kasi Vishweshwara Swamy

Temple in Bugga in Nagari Mandal. 

TTD SE Sri Satyanarayana, Deputy EO Srimati Naga Ratna, EE Sri Manoharam, Deputy EE Sri Bhaskar along with local public representatives participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

బుగ్గ లో టీటీడీ కల్యాణ మండపానికి శంఖుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్, మంత్రి

తిరుపతి 14 ఫిబ్రవరి 2024: పేదలు తక్కువ ఖర్చుతో దేవుడి సన్నిధిలో పెళ్ళిళ్ళు చేసుకుంటే శుభం జరుగుతుందనే నమ్మకంతో బుగ్గ లో కల్యాణ మండపం నిర్మిస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు.

నగరి మండలం బుగ్గ లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణేశ్వరి సమేత ఆలయం సమీపంలో రూ 2 కోట్లతో నిర్మించనున్న టీటీడీ కల్యాణ మండపానికి మంత్రి శ్రీమతి ఆర్ కె రోజాతో కలసి బుధవారం ఆయన శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా శ్రీ కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, మంత్రి శ్రీమతి రోజా అభ్యర్థన మేరకు కల్యాణ మండపం మంజూరు చేశామన్నారు. మూడో అంతస్థుతో పాటు ఆలయ అభివృద్ధికి కూడా సహకారం అందిస్తామని ఆయన చెప్పారు.

మంత్రి శ్రీమతి రోజా మాట్లాడుతూ, బుగ్గ లో కల్యాణ మండపం నిర్మించాలనేది చాలా సంవత్సరాల కోరిక అన్నారు. శ్రీ కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్ కాగానే తన అభ్యర్థన మేరకు కల్యాణ మండపం మంజూరు చేశారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పవిత్రమైన ఈ ప్రాంతంలో వివాహం చేసుకుంటే అంతా శుభం జరుగుతుందని అన్నారు. ఎంతో పురాతనమైన, పవిత్రమైన కాశీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి కి టీటీడీ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

టీటీడీ ఎస్ ఈ శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో శ్రీమతి నాగ రత్న, ఈ ఈ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈ ఈ శ్రీ భాస్కర్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది