G0DDESS OF RICHES MESMERIZES DEVOTESS AS CELESTIAL ENCHANTRESS_ పల్లకీలో మోహిని అవతారంలో శ్రీ పద్మావతి అమ్మవారు విహారం
Tiruchanoor, 8 Dec. 18: On Day fifth day of ongoing Karthika Brahmotsavams of Sri Padmavati Ammavari temple, Goddess Padmavati rode on Palanquin as celestial enthantress, JaganMohini.
Holding Amrutha kalasa in a hand, the goddess was seated elegantly in all Her splendour to bless the devotees.
The celestial event was marked by kolatas, Chakka bhajans and holy drum beats on the Mada streets as devotees thrilled by darshan of their beloved deity and offered coconuts and harati with utmost devotion.
SNAPANAM PERFORMED
Earlier in the morning snapana Thirumanjanam was performed to the utsava idol of Goddess Padmavati with turmeric, milk, sandal paste, curd, honey, coconut water and the Ammavaru was specially and artistically decorated.
TTD EO Sri AK Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy, DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పల్లకీలో మోహిని అవతారంలో శ్రీ పద్మావతి అమ్మవారు విహారం
తిరుపతి, 2018 డిసెంబరు 08: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం మోహిని అవతారంలో అమ్మవారు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు ఈ ఉత్సవం సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం సకల లోక రక్షణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యమోహినీ రూపంలో భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. కనుక అమ్మవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు. ఈనాటి అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది అని ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి తెలిపారు.
ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.
మధ్యాహ్నం 3.00 నుండి 5.00 గంటల వరకు అమ్మవారి ఆలయంలోని ముఖ మండపంలో వసంతోత్సవం వేడుకగా జరుగనుంది. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. కాగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి , అదనపు సివి అండ్ ఎస్వో శ్రీశివకుమార్‌రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.